ముంబై: తన సినిమాల్లో మహిళ పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటూ వరుస విజయాలు అందుకుంటున్నారు హీరోయిన్ తాప్సి పన్ను. అంతేగాక తన నటనతో సినిమా ఆఫర్లు సైతం తనని వెతుక్కుంటూ వచ్చేలా తాప్సీ మార్కులు కొట్టెశారు. అలాంటి ఆమె ఒకప్పుడు పరిశ్రమలో అవమానకర పరిస్థితులను చుశానని ఇటీవల ఓ ఇంటర్యూలో వెల్లడించారు. ఆ సమయంలో ఇండస్ట్రీలో దురదృష్టవంతురాలిగా తనపై ఓ మార్క్ ఉండేదన్నారు. ఇక నిర్మాతలు వారి సినిమాలకు తను సంతకం చేయడాన్ని సిగ్గుచేటుగా భావించేవారన్నారు. ‘నేను మొదట్లో అంత అందంగా లేకపోవడం వల్ల పరిశ్రమలో ఎన్నో అవమానకర పరిస్థితులను ఎదుర్కొన్నాను. అంతేకాదు కొంతమంది హీరోల సరసన నేను నటించడం వారి భార్యలకు సిగ్గుచేటుగా భావించి నా స్థానంలో మిగతా హీరోయిన్‌లకు అవకాశం ఇప్పించేవారు. అంతేగాక నేను నటించి ఓ సినిమాకు డబ్బింగ్ నేనే చెప్పకున్నాను.(చదవండి: 'థప్పడ్' సినిమాకు అరుదైన గౌరవం)
అయితే ఇందులో నా గొంతు అంతబాగా లేదని, నేను చెప్పిన డైలాగ్ హీరోకు నచ్చకపోవడంతో అది మార్చుకోవాలని ఆ హీరో నాకు సూచించాడు. నేను దానిని తిరస్కరించడంతో వారు నాకు తెలియకుండా డబ్బింగ్ ఆర్టిస్టులకు పెట్టుకున్నారు. ఇక మరో సినిమాలో హీరో మునుపటి చిత్రాలు సరిగా ఆడకపోవడం వల్ల వారి బడ్జేట్ కంట్రోల్ చేసుకునేందుకు నా రెమ్మ్యూనరేషన్ తగ్గించుకోవాలని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. ఇక మరో సినిమాలో నా ఇంట్రడక్షన్ సీన్.. హీరో ఇంట్రడక్షన్ కంటే బాగా వచ్చిందని హీరోలు ఆరోపించడంతో నా సీన్‌లను మార్చిన సందర్భాలున్నాయి. అయితే ఇవి నాకు తెలిసినవి, నా ముందు జరిగినవి మాత్రమే. ఇక నాకు తెలియకుండా వెనకాలా ఇంకేన్ని జరిగాయో తెలియదు’ అని తాప్సీ చెప్పుకొచ్చారు. (చదవండి: తాప్సీకి మాల్దీవులు స్పెషల్ ట్రిప్!)
మరైతే ఆ పరిస్థితులను ఎలా అధిగమించారని అడగ్గా... ‘అప్పటి నుంచి నేను నాకు సంతోషాన్నిచ్చే సినిమాలనే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాను. అదే విధంగా ఇప్పటికీ చేస్తున్నాను. కానీ నా నిర్ణయం సరైనది కాదని చాలా మంది నాకు నచ్చజెప్పాలి చుశారు. నా నిర్ణయం వల్ల నేను హీరోయిన్‌గా ఎక్కువకాలం రాణించకపోవచ్చని, ఇది సరైనది కాదని సలహా ఇచ్చేవారు. ఎందుకంటే ఓ హీరోయిన్‌గా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం వల్ల హీరోలు తమ సినిమాల్లో అవకాశం ఇచ్చేందుకు వెనుకాడతారు. అయితే ఇది కష్టమైనదే. కానీ దీనివల్ల నేను సంతోషంగా ఉంటున్నాను’ అని సమాధానం ఇచ్చారు. కాగా ‘థప్పడ్’, ‘మిషన్ మంగళ్’, ‘బద్లా’ వంటి ప్రతిష్టాత్మక సినిమాల్లో నటించి తాప్సి పరిశ్రమలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. (చదవండి: ‘రియా ఎవరో నాకు నిజంగా తెలియదు’)
Comments
Please login to add a commentAdd a comment