taapsee pannu new movie looop lapeta first look - Sakshi
Sakshi News home page

నా జీవితం ఎందుకు ఇంత గందరగోళంలో పడింది!

Published Wed, Feb 3 2021 8:43 AM | Last Updated on Wed, Feb 3 2021 10:49 AM

Taapsee Pannu Shares New Movie Looop Lapeta First Look - Sakshi

హీరోయిన్‌ తాప్సీ మంచి జోరు మీదున్నారు. హిందీలో, తమిళంలో వరుస అవకాశాలతో దూసుకెళుతున్నారు. ఆకాష్‌ ఖురానా దర్శకత్వంలో ‘రష్మీ రాకెట్‌’ చిత్రాన్ని ఇటీవల పూర్తి చేసిన తాప్సీ తన తర్వాతి చిత్రం ‘లూప్‌ లపేటా’ చిత్రీకరణలో జాయిన్‌ అయ్యారు. ఈ చిత్రానికి ఆకాష్‌ భాటియా దర్శకత్వం వహిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న తాప్సీ సోషల్‌ మీడియా వేదికగా తన ఫస్ట్‌ లుక్‌ని అభిమానులతో పంచుకున్నారు. ‘హాయ్‌... నేను సవి! కొన్నిసార్లు జీవితంలో మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సిన సమయం వస్తుంది. నేను ఈ స్థితికి ఎందుకు వచ్చాను అని! నేను కూడా అదే ఆలోచి స్తున్నా. నా జీవితం ఇంత గందరగోళంలో ఎందుకు పడిందని!’’ అని సినిమాలో తన పాత్ర ఎలా ఉంటుందో టూకీగా చెప్పారు తాప్సీ. డార్క్‌ కామెడీ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. జర్మన్‌ చిత్రం ‘రన్‌ లోలా రన్‌’కి ఇది హిందీ రీమేక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement