రాత్రి పది తర్వాత అలా చేయడం ఇష్టముండదు: తాప్సీ కామెంట్స్ వైరల్ | Taapsee Pannu Shares About Experience with bollywood celebrities | Sakshi
Sakshi News home page

Taapsee Pannu: రాత్రి 10 గంటల తర్వాత ‍అలా చేయడం కష్టం: తాప్సీ

Mar 12 2024 4:43 PM | Updated on Mar 12 2024 5:28 PM

Taapsee Pannu Shares About Experience with bollywood celebrities - Sakshi

టాలీవుడ్‌లో ఝుమ్మంది నాదం సినిమాతో ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ తాప్సీ. ఇటీవల తాను పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలొచ్చాయి. కానీ వాటిన్నింటిని కొట్టిపారేసింది. ఈ భామకు టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్‌కు మకాం మార్చింది. హిందీలో సినిమాలు చేస్తూ అలరిస్తోంది. అయితే ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే తాప్సీ తన పర్సనల్ విషయాలను మాత్రం సీక్రెట్‌గానే మెయింటెన్ చేస్తోంది. కానీ ఇండస్ట్రీలో జరిగే ఈవెంట్స్‌, పార్టీల్లో కూడా పెద్దగా కనిపించదు. ఇటీవల జామ్‌నగర్‌లో జరిగిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సైతం హాజరు కాలేదు. మీరేందుకు పార్చీలకు వెళ్లరంటూ ఆమెను ప్రశ్నించగా ఆసక్తికర సమాధానాలిచ్చింది. రాత్రి 10 గంటల తర్వాత పార్టీలు చేసుకోవడం తనకు ఇష్టముండదని వెల్లడించింది. 

తాప్సీ మాట్లాడుతూ..'పెద్ద స్టార్స్‌కి మెసేజ్‌లు పంపమని కొందరు చెప్పారు. అలా అయితేనే నన్ను పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానిస్తారు. కానీ నేను అలా చేయలేను. ఎందుకంటే పొద్దున్నే నిద్ర లేస్తా. అందుకే త్వరగా పడుకోవాలి. నాకు సిగరెట్, మందు తాగే అలవాటు లేదు. పార్టీలకు వెళ్లి ఏం చేయాలో నాకు తెలియదు' అని అన్నారు.

అంతే కాకుండా.. 'నాకు పరిచయం లేని వ్యక్తులతో పార్టీ చేసుకునే ఉద్దేశం లేదు. వారితో ఏమి మాట్లాడాలనేది నాకు తెలియదు. పార్టీలకు రాకపోతే ఏం పనికి రారని అర్థం కాదు. ఇలా పార్టీలు చేసుకుంటే బాలీవుడ్‌లో ముందుకెళ్లడం చాలా సులభం. అంతే కాకుండా రాత్రి 10 గంటల తర్వాత పార్టీ చేసుకోవడం నాకు భారంగా అనిపిస్తుంది. నేను కేవలం ఇప్పటివరకు నా కష్టంతోనే ఇక్కడి వరకు వచ్చాను' అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. తాప్సీ, మథాయుస్ బ్రో అనే వ్యక్తితో డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement