రాధికా ఆప్టే తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేసింది. మొదట వాహ్, లైఫ్ హో తో ఐసీ అనే హిందీ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో రాంగోపాల్ వర్మ చిత్రం రక్త చరిత్రతో ఎంట్రీ ఇచ్చింది. లెజెండ్, లయన్ సినిమాలతో మెప్పించింది. ఇటీవల విజయ్‌సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన మెర్రీ క్రిస్మస్ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించింది.
నిజాన్ని నిర్భయంగా మాట్లాడే అతికొద్దిమందిలో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాధికా ఆప్టే.. తాజాగా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాధికా ఆప్టే టాలీవుడ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
రాధికా ఆప్టే మాట్లాడుతూ..'తెలుగు పరిశ్రమలో నేను చాలా కష్టపడ్డా. కానీ తెలుగు సినిమాల్లో హీరోయిన్లను చూసే విధానం చాలా దారుణం. టాలీవుడ్ సినిమాల్లో మహిళల పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. సెట్‌లో మూడో వ్యక్తిగా ట్రీట్ చేస్తారు. ముఖ్యంగా తెలుగులో పురుష ఆధిపత్యం ఎక్కువ. అంతేకాదు.. ఇతర నటీనటులను అడగకుండానే వారికి ఇష్టమొచ్చినట్లు ఎప్పుడు పడితే అప్పుడు షూట్‍ను రద్దు చేస్తారు. అలా నేను చాలాసార్లు ఇబ్బందులు పడ్డాను కూడా. కానీ దానికి అక్కడే ఎండ్ కార్డ్ పడింది. అక్కడ నా అవసరం అంతవరకే అని గ్రహించా.' అంటూ విమర్శలు చేసింది. దీంతో రాధికా ఆప్టే చేసిన కామెంట్స్‌పై సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
#RadhikaApte about TELUGU Industry 😳😳😳😳 pic.twitter.com/YFLRroAvHX
— GetsCinema (@GetsCinema) February 16, 2024
Comments
Please login to add a commentAdd a comment