ఓటీటీలో తాప్సీ ‘దొబారా’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే? | Taapsee Pannu Dobaaraa Movie Release On OTT Platform Netflix | Sakshi
Sakshi News home page

Dobaaraa In OTT: ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన 'దొబారా'.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

Published Sat, Oct 1 2022 9:12 PM | Last Updated on Sat, Oct 1 2022 9:20 PM

Taapsee Pannu Dobaaraa Movie Release On OTT Platform Netflix - Sakshi

అగ్ర కథానాయిక తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'దొబారా'. అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 19న థియేటర్లలో రిలీజైంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అక్టోబరు 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. 

అసలు కథేంటంటే: ఓ యువతి చనిపోయిన అబ్బాయి ఆత్మతో మాట్లాడిన తర్వాత గతంలోకి వెళ్లి అతడి ప్రాణాలను ఎలా రక్షించిందన్నదే కథ. దొబారా సినిమా 2018లో వచ్చిన మిరేగ్‌ అనే స్పానిష్‌ సినిమాకు రీమేక్‌. ఏక్తాకపూర్‌ ‘కల్ట్‌ మూవీస్‌’, సునీర్‌ ఖేత్రాపాల్‌ ‘అథీనా’ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సుమారు రూ.30 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement