Taapsee Pannu To Star In Telugu Film Mishan Impossible- Sakshi
Sakshi News home page

Taapsee Pannu: అందుకోసం ఏడేళ్లుగా వెతుకుతున్నా!

Published Wed, Jul 7 2021 4:35 AM | Last Updated on Wed, Jul 7 2021 11:42 AM

Taapsee Pannu To Star In A Tollywood Movie Mishan Impossible - Sakshi

‘ఆనందో బ్రహ్మ’ వంటి హిట్‌ తర్వాత తాప్సీ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న తెలుగు చిత్రం ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్‌ స్వరూప్‌ ఆర్‌ఎస్‌జె దర్శకత్వం వహిస్తున్నారు. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. మంగళవారం నుంచి ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు తాప్సీ. ఆమె చేతికి కట్టుతో ల్యాప్‌టాప్‌లో ఏదో సీరియస్‌గా చూస్తున్న వర్కింగ్‌ స్టిల్‌ను కూడా విడుదల చేసింది చిత్రబృందం.

తాప్సీ మాట్లాడుతూ– ‘‘ఒక ప్రేక్షకురాలిగా నన్ను నేను చూడాలనుకునే కథల్లో భాగం కావాలని ఏడేళ్లుగా వెతుకుతున్నాను. అలాంటి చిత్రాల్లో ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ ఒకటి. ఆకట్టుకునే కథాంశంతో సినిమా రూపొందుతోంది’’ అన్నారు. ఈ చిత్రానికి అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌: ఎన్‌ఎం పాష, కెమెరా: దీపక్‌ యరగర, సంగీతం: మార్క్‌ కె. రాబిన్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement