
హసీన్ దిల్‌రుబ సినిమాతో హిట్ అందుకుంది హీరోయిన్ తాప్సీ పన్ను. ఈ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న హసీన్ దిల్‌రుబ 2 రేపు(ఆగస్టు 9న) నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా తాప్సీ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది.
బిజీ అయిపోయా
ఒక డిఫరెంట్ స్టోరీతో సినిమా తీయాలనుకుంటున్నట్లు దర్శకురాలు కనికా ధిల్లాన్ చెప్పింది. ఆ కథ వినడానికి నేను ఆసక్తిగా ఉన్నానన్నాను. తర్వాత ఇతర సినిమాల షూటింగ్ బిజీలో పడిపోయాను. ఆ షూటింగ్ పూర్తి చేసుకునేసరికి కనిక.. తన కథను మరో నటికి వివరించిందని తెలిసింది.
వెంటనే ఓకే చెప్పా
కొన్ని నెలల తర్వాత తను మళ్లీ నాకు ఫోన్ చేసింది. తన ఆఫీసుకు రమ్మని కథ వినిపించింది. కథ చెప్పడం పూర్తవగానే గట్టిగా నవ్వేశాను. ఇంతకుముందే ఈ మూవీ చేద్దామని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను అన్నాను. అయినా స్క్రిప్ట్ విన్న వెంటనే నాకోసమే రాసినట్లు అనిపించి వెంటనే ఓకే చెప్పా అంది.
Comments
Please login to add a commentAdd a comment