తాప్సీ ఇన్‌స్టా పోస్ట్‌ : ఆమెను ఉద్ధేశించేనా? | Taapsee Pannu Instagram Post Gone Viral | Sakshi
Sakshi News home page

తాప్సీ ఇన్‌స్టా పోస్ట్‌ : ఆమెను ఉద్ధేశించేనా?

Published Fri, Mar 19 2021 7:47 PM | Last Updated on Fri, Mar 19 2021 9:25 PM

Taapsee Pannu Instagram Post Gone Viral - Sakshi

చల్ల బడిందనుకున్న వివాదానికి తాప్సీ తాజా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌తో నిప్పు రాజుకునేలా ఉంది...

బాలీవుడ్‌ నటీమణులు తాప్సీ పన్ను, కంగనా రనౌత్‌ల మధ్య గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియా వేదికగా వార్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు సైతం చేసుకున్నారు. తాప్సీ ఇంట్లో ఐటీ రైడ్స్‌ నేపథ్యంలో ఈ వార్‌ తారాస్థాయికి చేరింది. ఆ తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. అయితే, చల్ల బడిందనుకున్న వివాదానికి తాప్సీ తాజా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌తో నిప్పు రాజుకునేలా ఉంది. శుక్రవారం ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘‘ కొంతమంది నీపై రాళ్లు విసురుతారు. నువ్వు వాటిని మైలు రాళ్లుగా భావించి ముందుకుసాగాలి’’ అ‍న్న సచిన్‌ టెండూల్కర్‌ కొటేషన్‌ను ఆమె ఉటంకించారు. అయితే, ఈ పోస్ట్‌ కంగనా రనౌత్‌ను ఉద్ధేశించేనని నెట్టింట చర్చ మొదలైంది. ఊరికే ఉండక మళ్లీ వివాదానికి తెరతీయటం అవసరమా అంటూ కొంతమంది నెటిజన్లు మండిపడుతుంటే.. ఆ పోస్ట్‌కు కంగనాకు సంబంధమే లేదని మరికొంతమంది తాప్సీని వెనకేసుకొస్తున్నారు.

కాగా, తాప్సీ ప్రస్తుతం ‘‘ లూప్‌ లపేటా’’ చిత్రంలో నటిస్తోంది. ఆకాష్‌ భాటియా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాప్సీతో పాటు తాహి భాసిన్‌, దెప్‌సైనీ, శ్రేయ ధావన్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 2021, అక్టోబర్‌ 22వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

చదవండి : ‘జాతి రత్నాలు’ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌‌‌‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement