‘లూప్‌ లాపేట’ విడుదల తేదీని ప్రకటించిన తాప్సీ | Taapsee Pannu Announced Looop Lapeta Release Date On Social Media | Sakshi
Sakshi News home page

‘లూప్‌ లాపేట’ విడుదల తేదీని ప్రకటించిన తాప్సీ

Published Tue, Mar 9 2021 3:47 PM | Last Updated on Tue, Mar 9 2021 3:55 PM

Taapsee Pannu Announced Looop Lapeta Release Date On Social Media - Sakshi

హీరోయిన్‌ తాప్సీ పన్ను నివాసాంపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫాంటమ్‌ ఫిల్మ్స్ ప్రమోటర్లు అయిన తాప్సీ, దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, దర్శకనిర్మాత విక్రమాదిత్య మోత్వానే, వికాస్‌ బెహల్‌, మధు మంతెనకు సంబంధించిన ఇళ్లలో, కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో తాప్సీ తన అభిమానులకు ఓ గుడ్‌న్యూస్‌ చెప్పారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘లూప్‌ లపేటా’ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. థ్రీల్లర్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కతున్న ఈ చిత్రంలో తాప్సీ సవిగా లీడ్ ‌రోల్‌ పోషిస్తుండగా ఇందులో ఆమె ప్రియుడుగా తాహిర్ రాజ్ భాసిన్‌ కనిపించనున్నాడు.

జర్మన్ హిట్ చిత్రం ‘రన్ లోలా రన్’ మూవీని హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరపుకుంటున్న ఈ చిత్రం విడుదల తేదీని తాప్సీ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ‘మాకు చాలా అరుదుగా లభించే కామిక్ థ్రిల్లర్! సవి, సత్యలను కలవడానికి మిమ్మల్నీ మీరు సిద్దం చేసుకోండి.. ఈ అక్టోబర్ 22, 2021న థియేటర్లలోకి ‘లూప్‌ లపేటా’ రానుంది’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. కాగా ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను తాప్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ‘హాయ్‌... నేను సవి! కొన్నిసార్లు జీవితంలో మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సిన సమయం వస్తుంది. నేను ఈ స్థితికి ఎందుకు వచ్చాను అని! నేను కూడా అదే ఆలోచి స్తున్నా. నా జీవితం ఇంత గందరగోళంలో ఎందుకు పడింది’ అంటూ సినిమాలో తన పాత్ర ఎలా ఉంటుందో టూకీగా చెప్పారు తాప్సీ. 

చదవండి: నా జీవితం ఎందుకు ఇంత గందరగోళంలో పడింది! 
                ఆమె డీఎన్‌ఏలోనే విషం ఉండొచ్చు: తాప్సీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement