
కొందరు తారలకు తమ వ్యక్తిగత విషయాలను ఊరంతా చాటింపు వేసి చెప్పుకోవడం అస్సలు ఇష్టముండదు. హీరోయిన్ తాప్సీ పన్ను కూడా అదే కోవలోకి వస్తుంది. ప్రియుడు, డెన్మార్క బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోతో ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ పెళ్లి చేసుకోనుందంటూ వార్తలు వస్తే అలాంటిదేం లేదని కప్పిపుచ్చింది. కట్ చేస్తే సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది. మార్చి నెలలో వీరి వివాహం జరిగింది. తరర్వాత తమ పెళ్లి గురించి పరోక్షంగా మాట్లాడుతూ వచ్చింది.

సాంగ్ లాంచ్ ఈవెంట్
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఖేల్ ఖేల్ మే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా నుంచి హాలి హాలి అనే పాటను గురువారం సాయంత్రం రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ నుంచి తిరిగొస్తున్న తాప్సీని చూసిన ఓ ఫోటోగ్రాఫర్ ఆమెకు శుభాకాంక్షలు చెప్పాడు. అదేంటి? మూవీ రిలీజ్ కాకముందే హిట్టయిందా? అని సరదాగా అడిగింది.

నా పెళ్లి నేనే మర్చిపోయా
అందుకాయన పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నాడు. అది విన్న తాప్సీ.. పెళ్లి గురించి కంగ్రాట్స్ చెప్తున్నావా? నాకు వివాహమైందన్న విషయం నేనే మర్చిపోయాను అని ఫన్నీగా రిప్లై ఇచ్చింది. కాగా తాప్సీ 'ఫిర్ ఆయి హసీన్ దిల్‌రుబా' సినిమాలో నటించింది. ఇది 'హసీన్ దిల్‌రుబా'కు సీక్వెల్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం ఆగస్టు 9న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment