అదేంటో కొందరు హీరోయిన్లు కావాలని కాంట్రవర్సీ చేస్తారో లేదంటే వాళ్లు మాట్లాడిన తర్వాత ఆ కామెంట్స్ వివాదాస్పద అవుతుందో అస్సలు అర్థం కాదు. కానీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ అవుతుంటారు. ఇప్పుడు కూడా హీరోయిన్ తాప్సీ అలానే మాట్లాడింది. తనవైపు అందరూ చూసేలా చేసింది.
హీరోయిన్ తాప్సీ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే 'ఝమ్మంది నాదం' అనే తెలుగు సినిమాతోనే హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత ఇక్కడ పలు చిత్రాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు. దీంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. బోలెడన్ని క్రేజీ మూవీస్ చేస్తూ బిజీగా ఉంది.
(ఇదీ చదవండి: రిలీజ్‌కి ముందే 'సలార్' మరో రికార్డ్)
చాలాకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న తాప్సీ.. తాజాగా ఇన్ స్టాలో నెటిజన్స్ చిట్ చాట్ చేసింది. ఇందులో భాగంగా ఒకతను.. 'మీ పెళ్లి ఎప్పుడు?' అని అడిగాడు. దీనికి తిన్నగా సమాధానమివ్వొచ్చుగా కానీ తాప్సీ అలా ఇవ్వలేదు. 'నేనింకా ప్రెగ్నెంట్ కాలేదు కాబట్టి అతి త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు' అని చెప్పుకొచ్చింది.
ఇప్పుడు కామెంట్స్ బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్- రణ్‌బీర్ కపూర్‌కి కౌంటర్‌లా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ జంట ఏప్రిల్‌లో 14న పెళ్లి చేసుకున్నారు. నవంబరు 6న ఆలియా బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఈ విషయమై తాప్సీ.. పరోక్షంగా కామెంట్స్ చేసినట్లు అనిపిస్తుంది. ప్రస్తుతం ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
(ఇదీ చదవండి: 'బేబీ' సినిమా.. ఆ దర్శకుడి రియల్ ప్రేమకథేనా?)
Comments
Please login to add a commentAdd a comment