
Taapsee Pannu Soon To Get Married To Mathias Boe: రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝమ్మంది నాదం సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ తాప్సీ. తొలి చిత్రంతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకున్న తాప్సీ అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించింది. ఈ క్రమంలో బాలీవుడ్ బాట పట్టిన ఈ బ్యూటీ లేడీ వరుస హిట్లతో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.
లేడీ ఓరియెంటెండ్ కథలతో అక్కడ సత్తా చాటుతుంది. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మాథియాస్ బోతో పీకల్లోతు ప్రేమలో ఉన్న తాప్సీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తుంది. వీరి పెళ్లికి ఇరు వర్గాల కుటుంబసభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు పెళ్లి ముహూర్తాన్ని కూడా నిర్ణయించినట్లు బీటౌన్‌లో టాక్ వినిపిస్తుంది.
త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రానుందట. కాగా బాలీవుడ్‌లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా గడుపుతున్న తాప్సీ తెలుగులో `మిషన్ ఇంపాజిబుల్’చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment