
సోషల్ మీడియాను వేదికగా చేసుకుని కొందరు ఆకతాయిలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్లను ఉద్దేశించి దారుణమైన కామెంట్స్ చేసేవాళ్లు ఎక్కువే. మనసుని నొప్పించే అలాంటి కామెంట్స్‌కి కూల్‌గా కౌంటర్ ఇవ్వడం అందరికీ సాధ్యం కాదు. కానీ తాప్సీ ఆ విషయంలో సూపర్. చాలా తెలివిగా సమాధానాలిస్తుంటారు. ‘బాలీవుడ్‌లో తాప్సీ చాలా చెత్త నటి. నాకు తనని మళ్లీ సినిమాల్లో చూడాలని లేదు. ఓ రెండు మూడు సినిమాల తర్వాత తనకు బాలీవుడ్‌లో సినిమాలు ఉండవు’ అని గతంలో ట్వీటర్‌లో ఓ ఫాలోయర్ తాప్సీని ఉద్దేశించి అన్నాడు.
‘‘మిమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నందుకు ఏమీ అనుకోవద్దు. ఆల్రెడీ మూడు సినిమాలు చేసేశాను. ఇంకొన్ని సినిమాలు సైన్ చేశాను’’ అని కూల్‌గా బదులిచ్చారు తాప్సీ. ఇలా ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు ఏదొకటి అనడం తాప్సీ వాటికి దీటుగా సమాధానాలివ్వడం ఆనవాయితీ అయింది. ఇప్పుడు ఏమైందంటే... ‘మీ బాడీ పార్ట్స్ అంటే నాకు ఇష్టం’ అని ఓ ఫాలోయర్ అన్నాడు. ఇలా అనడం సంస్కారం కాదు. మరి.. తాప్సీ అతనికి ఏమని బదులిచ్చారంటే... ‘‘వావ్.. నాక్కూడా చాలా ఇష్టం. మరి నాకైతే నా బ్రెయిన్‌లోని సెరిబ్రమ్ (పెద్ద మెదడు) ఇష్టం. నీకేది ఇష్టం’’ అన్నారు. అంతే.. అతగాడి నుంచి రిప్లై రాలేదు. నిజంగా తాప్సీది పెద్ద బుర్రే. అందుకే కూల్‌గా సమాధానం ఇచ్చి నోరు మూయిం చారు.
Comments
Please login to add a commentAdd a comment