హిందీలో తాప్సీ హలోబ్రదర్! | Two Actresses in Sequel for Massive Hit 'Hello Brother' Film | Sakshi
Sakshi News home page

హిందీలో తాప్సీ హలోబ్రదర్!

Published Tue, Nov 8 2016 11:18 PM | Last Updated on Mon, Aug 13 2018 3:04 PM

హిందీలో తాప్సీ హలోబ్రదర్! - Sakshi

హిందీలో తాప్సీ హలోబ్రదర్!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి ‘పింక్’ చిత్రంలో నటించిన తాప్సీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ సినిమా హిట్ కావడంతో తాప్సీకి బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా తన కొడుకు వరుణ్ ధావన్ హీరోగా డేవిడ్ ధావన్ తెరకెక్కించనున్న ‘జుడ్వా-2’లో ఓ హీరోయిన్‌గా తాప్సీ ఎంపికయ్యారు. నాగార్జున, రమ్యకృష్ణ, సౌందర్య కాంబినేషన్‌లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హలో బ్రదర్’కు ఇది రీమేక్.

1994లో  ‘హలో బ్రదర్’ విడుదలైన మూడేళ్లకు ‘జుడ్వా’ పేరుతో డేవిడ్ ధావన్ హిందీలో రీమేక్ చేశారు. ఆ రీమేక్‌లో సల్మాన్‌ఖాన్, కరీనా కపూర్, రంభ నటించారు. ఇటు తెలుగులో, అటు హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ చిత్రానికి హిందీలో సీక్వెల్ తీయనున్నారు డేవిడ్. తెలుగులో సౌందర్య, హిందీలో రంభ చేసిన పాత్రను తాజా సీక్వెల్‌లో తాప్సీ చేయనున్నారు. అలాగే తెలుగులో రమ్యకృష్ణ, హిందీలో కరీనా కపూర్ చేసిన పాత్రను జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘జుడ్వా-2’గా రూపొందనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 29న రిలీజ్ చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement