!['అమితాబ్ ఇంటలిజెంట్ యాక్టర్' - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/51472285603_625x300.jpg.webp?itok=SAbH9my-)
'అమితాబ్ ఇంటలిజెంట్ యాక్టర్'
బాలీవుడ్ షెహన్షా అమితాబ్, వయసైపోతున్నా విలక్షణ పాత్రలతో ఈ జనరేషన్ నటులకు పోటి ఇస్తున్నాడు. వరుసగా అవార్డ్ విన్నింగ్ క్యారెక్టర్లను ఎంచుకుంటున్న బిగ్ బి, మరోసారి అదే ప్రయోగం చేస్తున్నాడు. బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సూజిత్ సర్కార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న పింక్ సినిమాలో మానసిక రుగ్మతతో బాధపడుతున్న లాయర్గా నటిస్తున్నాడు.
ఈ పాత్రకు అమితాబ్ ఎంపిక ఎలా జరిగిదన్న విషయాన్ని బయటపెట్టాడు సూజిత్ సర్కార్. 'పీకు సినిమా షూటింగ్ సమయంలోనే పింక్ సినిమాలోనే లాయర్ పాత్రకు ఎవరిని ఎంపిక చేయాలన్న చర్చ జరిగింది. అసలు ఆ పాత్రను యువ నటుడితో వేయించాలా..? లేదా మిడిల్ ఏజ్ ఆరిస్ట్తో చేయించాలా..? లేక సీనియర్ను ఎంపిక చేయాలా..? అని ఆలోచించాం. అదే సమయంలో అమితాబ్ ఆ పాత్రలో నటిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది.
వెంటనే బిగ్ బిని సంప్రదించాం. పింక్ సినిమాలోని పాత్ర గురించి ఆయనకు వివరించా... అమితాబ్ ఇంటలిజెంట్ ఆర్టిస్ట్. కేవలం ఐదు నిమిషాల పాటు కథ విని ఈ పాత్రకు అంగీకరించారు'. అని బిగ్ బి ఎంపిక వెనుక కథను తెలియజేశారు. అనిరుద్దా రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది.