
పింక్‌కి అవార్డుల బోణీ...
మనదేశంలో ‘మేరిటల్ రేప్’ గురించి అవగాహన పెద్దగా లేదు. వైవాహిక జీవితంలో భార్య ఎప్పుడైనా భర్తకు సరైన కారణాలతో ‘నో’ చెప్తే భర్త ఆమెను లైంగికంగా వేధించకూడదు. లైంగిక అనుభవం గురించి బలవంత పెట్టకూడదు. అనుభవం పొందకూడదు. కానీ అదేం పెద్ద విషయం కాదన్నట్టు చెల్లుబాటైపోతూ ఉంటుంది. అలాంటిది... పరిచితమైన అమ్మాయి చనువు ఉన్నా సరే ‘నో’ చెప్తే, ఆమెపై లైంగిక చర్య కోసం పట్టుపడటం రేప్‌తో సమానం అని చెప్పిన ‘పింక్’ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది.
దీనికి అవార్డుల బోణీ మొదలైంది కూడా. ‘స్టార్ స్క్రీన్ అవార్డ్స్’ వేడుక గత వారం జరుగగా 2016 ఉత్తమ చిత్రంగా ‘పింక్’ నిలిచింది. అంతే కాదు అమితాబ్ బచ్చన్ ఉత్తమ నటుడుగా అవార్డు పొందాడు. ఇంకా చాలా అవార్డుల వేడుకలు ఉన్నాయి. అన్నింటిలో కలిపి ‘పింక్’ ఎన్ని అవార్డులు గెలుచుకుంటుందో వేచి చూడాలి.