
ఆ సినిమా చూసి ఫిదా అయిన సమంత!
అమిబాత్ బచ్చన్, తాప్సీ పన్ను ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'పింక్'. లైంగిక వేధింపులు నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పటికే ఈ సినిమాను బాలీవుడ్ ప్రముఖులు పొగడ్తల్లో ముంచెత్తుతుండగా.. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ సమంత కూడా ఈ జాబితాలో చేరింది.
సమంతను 'పింక్' సినిమా బాగా కదిలించింది. ఈ ఏడాది వచ్చిన సినిమాల్లోనే 'పింక్' అత్యంత ముఖ్యమైన సినిమా అని ఆమె పేర్కొంది. 'ఈ ఏడాది సినిమాల్లో 'పింక్' అత్యంత కీలక సినిమాగా నిలిచిపోతుంది. ఇది నిజంగా గొప్ప సినిమా. చిత్ర యూనిట్‌పై గొప్ప గౌరవం కలిగింది' అని సామ్ ట్వీట్ చేసింది.
నాయిక ప్రాధాన్యమున్న సినిమాలు దక్షిణాదిలో కూడా రావాలని సమంత చాలాకాలంగా కోరుతూ వస్తున్నది. 'పింక్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తారని వినిపిస్తోంది. ఈరకంగా సమంత కోరిక కొంతలో కొంత నెరవేరినట్టే.