
స్విస్‌లో ‘పింక్’ స్వింగ్!
ఆసీస్, ఇంగ్లండ్‌లాంటి చోట ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నా... ప్రపంచ క్రికెట్‌లో తొలిసారి పూర్తి స్థాయిలో ‘పింక్’ బంతులను స్విట్జర్లాండ్ వినియోగించనుంది. 2015-16 దేశవాళీ సీజన్‌లో ఆ దేశంలోని 20 క్లబ్‌లు ఆడే అన్ని మ్యాచ్‌లలో పింక్ బంతులను ఉపయోగిస్తారు. క్రికెట్ ఇంకా బాలారిష్టాలను దాటని ఆ దేశంలో క్రికెట్ మాత్రమే ఆడే పెద్ద మైదానాలు లేవు, సైట్ స్క్రీన్‌లను వాడే అవకాశం లేదు. చుట్టు పక్కల మొత్తం తెల్ల రంగు భవనాలు, ఎర్రని ఇటుకల ఇళ్లు కనిపిస్తాయి. పచ్చటి అడవులు కూడా వర్షం, శీతాకాలాల్లో ఎర్రగా కనిపిస్తాయి. కాబట్టి బ్యాక్ గ్రౌండ్ క్రికెటర్లకు ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ఇప్పుడు అందరూ వాడే ఎరుపు, తెల్ల బంతులకు అక్కడ అవకాశమే లేదు! దాంతో మధ్యేమార్గంగా పింక్ బంతులను ఓకే చేశారు.