ఐఫా కాంట్రవర్సీ.. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు: తేజ సజ్జా | Teja Sajja Responds On IIFA 2024 Controversy | Sakshi
Sakshi News home page

ఆ హీరోలను తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశం నాకు లేదు: తేజ సజ్జా

Published Sat, Nov 16 2024 11:28 AM | Last Updated on Sat, Nov 16 2024 2:45 PM

Teja Sajja Responds On IIFA 2024 Controversy

‘ఐఫా’ అవార్డుల వేడుకలో రానా-తేజ సజ్జ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆ వేడుకకు వ్యాఖ్యాతలుగా చేసిన రానా-తేజ స్టార్‌ హీరోల సినిమాలపై జోకులు వేశారు. అయితే ఫ్యాన్స్‌ దానికి సంబంధించిన క్లిప్పులను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ..రానా-తేజలను ట్రోల్‌ చేస్తున్నారు. తాజాగా దీనిపై తేజ సజ్జ క్లారిటీ ఇచ్చారు. ఐఫా వేడుకలో తాము సరదా కోసమే అలా మాట్లాడామని, ఫుల్‌ వీడియో చూస్తే ఆ విషయం అందరికి అర్థమవుతుందని చెప్పారు. 

‘ఐఫా అవార్డులు అనేది ఒక జాతీయ స్థాయి వేడుకు. దాని కోసం చాలా మంది స్క్రిప్ట్‌ రైటర్స్‌ పని చేస్తుంటారు. అన్ని విధాల చెక్‌ చేసుకున్న తర్వాతే మాకు స్క్రిప్టులు అందిస్తారు. మేము అదే ఫాలో అవుతాం. ఇప్పుడు మీరు  చూస్తున్న వీడియో క్లిప్పులన్నీ కట్‌ చేసినవి మాత్రమే. ఫుల్‌ వీడియో చూస్తే మీకు అసలు విషయం అర్థమవుతుంది. 

రానా నాపై జోకులు వేశాడు. నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. అందరి హీరోలతో కలిసి పని చేశాను. స్టార్‌ హీరోలందరితోనూ నాకు మంచి అనుబంధం ఉంది. వారిని తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశం నాకు లేదు. మా వ్యాఖ్యలు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే ఇలా కాంట్రవర్సీ చేస్తున్నారు’అని తేజ సజ్జ అన్నారు. 

కాగా, ఈ ఏడాది ఐఫా అవార్డుల వేడుక అబుదాబిలో నిర్వహించారు. సెప్టెంబర్‌లో జరిగిన ఈ వేడుకలో రానా-తేజ సజ్జ హోస్ట్‌గా వ్యవహరించారు. పలువురు టాలీవుడు స్టార్‌ హీరోహీరోయిన్లు ఈ వేడుకలో పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement