చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కరాల్లో ఒకటి ‘ఐఫా’ అవార్డ్స్. 22వ 'ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ' (IIFA Awards 2022)) అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం (జూన్ 4) రాత్రి ముగిసింది. జూన్ 3న అబుదాబిలో అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుకలో సినీ అతిరథుల మధ్య పురస్కారాలను అందజేశారు. ఈ వేడకకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్, మనీష్ పాల్ హోస్ట్‌గా వ్యవహరించారు. అలాగే షాహిద్ కపూర్, నోరా ఫతేహీలా డ్యూయెట్ సాంగ్ కనులవిందు చేసింది. ఐఫా అవార్డ్స్ గ్రీన్ కార్పెట్‌లో సినీ తారలు సందడి చేశారు. హీరోయిన్స్ తమ గ్లామర్‌తో కట్టిపడేశారు.
ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇదిలా ఉంటే ఉత్తమ నటీనటులకు, చిత్రాలకు అవార్డులు ప్రదానం చేశారు. అత్యధికంగా కియరా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర నటించిన 'షేర్షా' మూవీ అత్యధిక పురస్కరాలు సాధించింది.
- ఉత్తమ చిత్రం: షేర్షా (హిరో యశ్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, షబ్బీర్ బాక్స్‌వాలా, అజయ్ షా, హిమాన్షు గాంధీ)
- ఉత్తమ దర్శకుడు: విష్ణువర్ధన్ (షేర్షా)
- ఉత్తమ నటుడు: విక్కీ కౌషల్ (సర్దార్ ఉద్ధమ్)
- ఉత్తమ నటి: కృతి సనన్ (మిమి)
- ఉత్తమ నటుడు (డెబ్యూ): అహన్ శెట్టి (తడప్ 2)
- ఉత్తమ నటి (డెబ్యూ): శర్వారీ వాఘ్ (బంటీ ఔర్ బబ్లీ 2)
- ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠీ (లూడో)
- ఉత్తమ సహాయ నటి: సయూ తమ్హాంకర్
- మ్యూజిక్ డైరెక్షన్ (టై): ఏఆర్ రెహమాన్ (ఆత్రంగి రే), తనిష్క్ బగ్చీ, జస్లీన్ రాయల్, జావేద్-మోసిన్, విక్రమ్ మాంత్రోస్, బి ప్రాక్, జానీ (షేర్షా)
- ఉత్తమ నేపథ్య గాయకుడు: జుబిన్ నటియాల్ (రాతాన్ లంబియాన్-షేర్షా)
- ఉత్తమ నేపథ్య గాయకురాలు: అసీస్ కౌర్ (రాతాన్ లంబియాన్-షేర్షా)
- ఉత్తమ కథ (ఒరిజినల్): అనురాగ్ బసు (లూడో)
- ఉత్తమ కథ (అడాప్టెడ్): (కబీర్ ఖాన్, సంజయ్ పురాన్ సింగ్ చౌహన్ ఐసీసీ వరల్డ్ కప్ 1983 ఆధారంగా వచ్చిన 83)
- సాహిత్యం: కౌసర్ మునీర్ (లెహ్రే దో పాట-83)
Comments
Please login to add a commentAdd a comment