మూవింగ్ ఇమేజెస్ ఫిల్మ్‌క్లబ్ ఆధ్వర్యంలో వేడుకలు
ఈనెల 23 నుంచి 25 వరకు ప్రదర్శనలు, చర్చలు
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రేక్షకాదరణ పొందిన సినిమా ఉత్సవాలకు హైదరాబాద్ మరోసారి వేదిక కానుంది. మూవింగ్ ఇమేజెస్ ఫిల్మ్‌క్లబ్ 20 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 23వ తేదీ నుంచి 25 వరకు బంజారాహిల్స్‌లోని ఎల్‌వీ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో వివిధ భాషలకు చెందిన చిత్రాలను ప్రదర్శించనున్నారు.
23వ తేదీ సాయంత్రం 4 గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా సాయంత్రం 5.45 గంటలకు మరాఠీ కామెడీ చిత్రం ‘బైపన్ భారీ దేవ’ ప్రదర్శించనున్నారు. ప్రముఖ మరాఠీ సినీనటులు వందనాగుప్తా, సుకన్య కుల్‌కర్ణి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
24వ తేదీ రెండవ రోజు మరో అద్భుతమైన చిత్రం ‘ఆఫ్‌వాహ్’ ప్రదర్శించనున్నారు. ‘రాత్ కీ సుబ్హా నహీ’, ధారావి, చమేలి వంటి ఎన్నో అత్యుత్తమ చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు సు«దీర్ మిశ్రా ఈ చిత్ర ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అదేరోజు మధ్యాహ్నం అమల అక్కినేని, శార్వానంద్, రితూవర్మ తదితరులు నటించిన తమిళ చిత్రం ‘కనమ్’ ప్రదర్శన ఉంటుంది. చిత్ర దర్శకుడు శ్రీకార్తీక్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
25న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అసీమ్ మిశ్రాతో ముఖాముఖి చర్చా కార్యక్రమం
ఉంటుంది. పాన్‌సింగ్ తోమర్, న్యూయార్క్, బ్యాండ్ బాజా వంటి పలు చిత్రాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. అలాగే చివరి రోజు చిత్రాల్లో భాగంగా ‘కాడ్వి హవా’ (చేదు గాలి) సినిమాను ప్రదర్శించనున్నారు. ఎలాంటి టిక్కెట్లు లేవు, అర్ధవంతమైన స్ఫూర్తిదాయకమైన సినిమాలను ప్రేక్షకలోకానికి పరిచయం చేసే లక్ష్యంతో ఈ సినీమహోత్సవం నిర్వహిస్తున్నట్లు మూవింగ్ ఇమేజెస్ ఫిల్మ్‌క్లబ్ నిర్వాహకులు సంఘమిత్ర మాలిక్ తెలిపారు.ప్రదర్శనలు ఇలా..
– 23వ తేదీ సాయంత్రం 5.45 గంటలకు బైపన్ భారి దేవ మరాఠీ సినిమా ప్రదర్శన.
– 24వ తేదీ ఉదయం 11.30 గంటలకు హిందీ సినిమా ఆఫ్‌వ్హా. మధ్యాహ్నం 3 గంటలకు తమిళ సినిమా కనమ్ ప్రదర్శన ఉంటుంది.
– 25వ తేదీ ఉదయం 11.30 గంటలకు సినిమాటోగ్రాఫర్ అసీమ్ మిశ్రాతో చర్చా కార్యక్రమం, మధ్యాహ్నం 12 గంటలకు కాడ్వి హవా సినిమా ప్రదర్శన.
మూవింగ్ ఇమేజెస్ ఫిల్మ్‌క్లబ్ ప్రస్థానం..
ప్రముఖ దర్శకులు బిమల్‌రాయ్ కూతురు అపరాజిత సిన్హా మూవింగ్ ఇమేజెస్ ఫిల్మ్‌క్లబ్‌ను 2004 ఆగస్టు 28వ తేదీన స్థాపించారు. ఉత్తమ చిత్రాలకు విశేషమైన ప్రాచూర్యం కలి్పంచే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ఈ క్లబ్ ప్రముఖ కవి, రచయిత, దర్శకులు గుల్జార్ సాహెబ్ చేతులమీదుగా ప్రారంభమైంది. 20 ఏళ్లుగా కొనసాగుతున్న అత్యుత్తమ చిత్రాల ప్రదర్శనలో భాగంగానే ప్రస్తుతం 20 ఏళ్ల వేడుకలను నిర్వహిస్తున్నట్లు సంఘమిత్ర చెప్పారు. విభిన్న భాషలకు చెందిన సినీ దర్శకులు, రచయితలు, నటీనటులు ఈ వేడుకల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
ఇవి చదవండి: రెడీ.. సెట్.. గో..! మరో 4 రోజుల్లో.. హైదరాబాద్ మారథాన్!
Comments
Please login to add a commentAdd a comment