Film Festival of India
-
సినీమహోత్సవం! జాతీయ, అంతర్జాతీయ చిత్రాల ప్రదర్శన..
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రేక్షకాదరణ పొందిన సినిమా ఉత్సవాలకు హైదరాబాద్ మరోసారి వేదిక కానుంది. మూవింగ్ ఇమేజెస్ ఫిల్మ్‌క్లబ్ 20 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 23వ తేదీ నుంచి 25 వరకు బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో వివిధ భాషలకు చెందిన చిత్రాలను ప్రదర్శించనున్నారు.23వ తేదీ సాయంత్రం 4 గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా సాయంత్రం 5.45 గంటలకు మరాఠీ కామెడీ చిత్రం ‘బైపన్ భారీ దేవ’ ప్రదర్శించనున్నారు. ప్రముఖ మరాఠీ సినీనటులు వందనాగుప్తా, సుకన్య కుల్కర్ణి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.24వ తేదీ రెండవ రోజు మరో అద్భుతమైన చిత్రం ‘ఆఫ్వాహ్’ ప్రదర్శించనున్నారు. ‘రాత్ కీ సుబ్హా నహీ’, ధారావి, చమేలి వంటి ఎన్నో అత్యుత్తమ చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు సు«దీర్ మిశ్రా ఈ చిత్ర ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అదేరోజు మధ్యాహ్నం అమల అక్కినేని, శార్వానంద్, రితూవర్మ తదితరులు నటించిన తమిళ చిత్రం ‘కనమ్’ ప్రదర్శన ఉంటుంది. చిత్ర దర్శకుడు శ్రీకార్తీక్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు.25న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అసీమ్ మిశ్రాతో ముఖాముఖి చర్చా కార్యక్రమం ఉంటుంది. పాన్‌సింగ్ తోమర్, న్యూయార్క్, బ్యాండ్ బాజా వంటి పలు చిత్రాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. అలాగే చివరి రోజు చిత్రాల్లో భాగంగా ‘కాడ్వి హవా’ (చేదు గాలి) సినిమాను ప్రదర్శించనున్నారు. ఎలాంటి టిక్కెట్లు లేవు, అర్ధవంతమైన స్ఫూర్తిదాయకమైన సినిమాలను ప్రేక్షకలోకానికి పరిచయం చేసే లక్ష్యంతో ఈ సినీమహోత్సవం నిర్వహిస్తున్నట్లు మూవింగ్ ఇమేజెస్ ఫిల్మ్‌క్లబ్ నిర్వాహకులు సంఘమిత్ర మాలిక్ తెలిపారు.ప్రదర్శనలు ఇలా..– 23వ తేదీ సాయంత్రం 5.45 గంటలకు బైపన్ భారి దేవ మరాఠీ సినిమా ప్రదర్శన. – 24వ తేదీ ఉదయం 11.30 గంటలకు హిందీ సినిమా ఆఫ్వ్హా. మధ్యాహ్నం 3 గంటలకు తమిళ సినిమా కనమ్ ప్రదర్శన ఉంటుంది. – 25వ తేదీ ఉదయం 11.30 గంటలకు సినిమాటోగ్రాఫర్ అసీమ్ మిశ్రాతో చర్చా కార్యక్రమం, మధ్యాహ్నం 12 గంటలకు కాడ్వి హవా సినిమా ప్రదర్శన.మూవింగ్ ఇమేజెస్ ఫిల్మ్‌క్లబ్ ప్రస్థానం..ప్రముఖ దర్శకులు బిమల్‌రాయ్ కూతురు అపరాజిత సిన్హా మూవింగ్ ఇమేజెస్ ఫిల్మ్క్లబ్ను 2004 ఆగస్టు 28వ తేదీన స్థాపించారు. ఉత్తమ చిత్రాలకు విశేషమైన ప్రాచూర్యం కలి్పంచే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ఈ క్లబ్ ప్రముఖ కవి, రచయిత, దర్శకులు గుల్జార్ సాహెబ్ చేతులమీదుగా ప్రారంభమైంది. 20 ఏళ్లుగా కొనసాగుతున్న అత్యుత్తమ చిత్రాల ప్రదర్శనలో భాగంగానే ప్రస్తుతం 20 ఏళ్ల వేడుకలను నిర్వహిస్తున్నట్లు సంఘమిత్ర చెప్పారు. విభిన్న భాషలకు చెందిన సినీ దర్శకులు, రచయితలు, నటీనటులు ఈ వేడుకల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.ఇవి చదవండి: రెడీ.. సెట్.. గో..! మరో 4 రోజుల్లో.. హైదరాబాద్ మారథాన్! -
52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా-2021 (ఐఎఫ్ఎఫ్ఐ) ఉత్సవాల్లో తారల సందడి
-
గోవాలో సమంతా, ఆ క్రెడిట్ ఆమెదే: పిక్స్ వైరల్
International Film Festival 2021: అత్యంత ప్రతిష్టాత్మక 52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) ఉత్సవాలు గోవాలోని పనాజీలో తొమ్మిది రోజుల పాటు కొనసాగనున్నాయి. కరోనా మహమ్మారి తరువాత గోవా ప్రభుత్వం, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న స్పెషల్ ఈవెంట్ ఇది. ఈ వేడుకల్లో టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతతోపాటు, బాలీవుడ్ స్టార్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కరణ్ జోహార్, మనీష్ పాల్ ఈ ఈవెంట్‌కి హోస్ట్‌గా , ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో సమంత, ది ఫ్యామిలీ మ్యాన్ 2 దర్శకులు రాజ్ అండ్ డీకే టీమ్‌తో సందడి చేసింది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కు స్పీకర్‌గా ఆహ్వానించబడిన తొలి దక్షిణ భారత నటి సమంత కావడం విశేషం. 52వ ‘ఇఫీ’లో భాగంగా రాజ్, డీకే, అమెజాన్ ఇండియా ఒరిజినల్స్‌కు హెడ్ అపర్ణాపురోహిత్లతో ‘మాస్టర్‌క్లాస్’ గోష్ఠి జరిగింది. అందులో సమంత మాట్లాడుతూ, తెలుగు పరిశ్రమ, హైదరాబాద్ తనకు పుట్టినిల్లు అని పేర్కొంది. ఈ చిత్రోత్సవంలో ఇతర వక్తలుగా దర్శకురాలు అరుణా రాజే, నటుడు జాన్ ఎడతత్తిల్, నటుడు మనోజ్ బాజ్‌పేయి (వర్చువల్, సమంతా కూడా వర్చువల్ గానే పాల్గొంటుందని భావించారు) డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి పాల్గొన్నారు. ఇది తనకు మర్చిపోలేని అనుభవం అంటూ దీనికి సంబంధించిన ఫోటోలను సమంతా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అయితే ఈ కార్యక్రమానికి వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయిన మనోజ్ బాజ్‌పేయి వీడియో కాల్ ద్వారా సభనుద్దేశించి ప్రసంగించారు. ది ఫ్యామిలీ మ్యాన్-2 మేకింగ్ ముచ్చట్లను ఆడియెన్స్‌తో పంచుకున్నారు. ఈ ఫిలిం ఫెస్టివల్ ఈ నెల 28వరకు కొనసాగనుంది. కాగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక సినిమా 'శాకుంతలం'లో సమంత ప్రధాన పాత్రలో నటిస్తుంది. రాబోయే చిత్రం 'కత్తువాకుల రెండు కాదల్' షూటింగ్ కోసం చెన్నైలో ఉంది సమంత. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ డిసెంబర్లో థియేటర్లను పలకరించనుంది. సమంత, విజయ్ సేతుపతి, నయనతార ఇందులో నటిస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
మహానటికి అరుదైన గౌరవం
లెజెండరీ హీరోయిన్ సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పనోరమాలో ప్రదర్శనకు ఈ సినిమా ఎంపికైంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా మహానటి సినిమా తెరకెక్కింది. కీర్తి సురేష్, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా అంచనాలకు మించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. త్వరలో గోవాలో జరగనున్న 49వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్ఎఫ్ఐ)ఉత్సవాలలో ప్రదర్శనకు మహానటి సినిమా ఎంపికైంది. హిందీ, తమిళ, మలయాళం, తుళు ఇలా భారతీయ భాషల నుంచి 22 నాన్ ఫీచర్ చిత్రాలకు ఈ చిత్రోత్సవాలలో ప్రదర్శనకు చోటు దక్కింది. తెలుగు నుంచి ఆ గౌరవం మహానటికి మాత్రమే దక్కింది. -
సోనియాతో అమితాబ్ కు ఉన్న విభేదాలే కారణమా?
పనాజీ: ఇంతకు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హాజరవుతారా అంటూ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రశ్నించారు. నవంబర్ 20 తేది నుంచి ప్రారంభం కానున్న 45వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫీ) ముఖ్య అతిధిగా అమితాబ్ హాజరయ్యేది లేనిది వెల్లడించకపోవడంపై అనేక సందేహాలు తావిస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, అమితాబ్ కు మధ్య ఉన్న విభేదాల కారణంగానే ఇప్పటి వరకు ఇఫీలో పాల్గొనలేదని నిర్వాహకులు వెల్లడించారు. ముఖ్య అతిధిగా అమితాబ్ హాజరవుతున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ప్రకాశ్ జవదేకర్ స్పందిస్తూ... 'ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం, బహిష్కరించడం లాంటి అంశాలు తమ దృష్టికి రాలేదు. త్వరలోనే ముఖ్య అతిధి ఎవరు అనే అంశం కొలిక్కి వస్తుంది' అని అన్నారు. గోవాలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి గోవా శాశ్వత వేదికగా మారిన తర్వాత ఇప్పటి వరకు అమితాబ్ ముఖ్య అతిధిగా వ్యవహరించలేదు. కాని హెచ్ఐవీ/ఎయిడ్స్ మీడియా క్యాంపెన్ కు బ్రాండ్ అంబాసిడర్ హోదాలో మాత్రమే హాజరయ్యారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోవడంతో బిగ్ బీకి ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది.