Telugu movie industry
-
ఐఫా స్టార్స్.. 2024–హోస్ట్స్‌గా రానా, తేజా సజ్జ
సాక్షి, హైదరాబాద్: అతిపెద్ద సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ‘ఐఫా అవార్డ్స్ 2024’కు సర్వం సిద్ధమైంది. సుదీర్ఘకాలం తర్వాత ‘ఐఫా’ ప్రారంభ కార్యక్రమం నగరంలోని హెచ్ఐసీసీ వేదికగా మంగళవారం నిర్వహించారు. యూఏఈ అబుదాబిలోని యస్ ద్వీపం వేదికగా సెపె్టంబర్ 6, 7 తేదీల్లో జరగనుంది. నగరంలో ఏర్పాటు చేసిన ప్రారంభ వేడుకల్లో పలువురు తెలుగు, తమిళ, మలయాళీ, కన్నడ సినీ తారలతో పాటు అబుదాబి కల్చరల్ టూరిజం ప్రతినిధి అబ్దుల్లా యూసఫ్ మొహమ్మద్, ఫెస్టివల్ యూనిట్ హెడ్ డీటీసీ– నవాఫ్ అలీ అల్జాహ్దమీ తదితర ప్రతినిధులు సందడి చేశారు. ఈ సందర్భంగా పలువురు సినీ తారలు పంచుకున్న అభిప్రాయాలు వారి మాటల్లోనే...ప్రపంచ స్థాయి గుర్తింపు భారతీయ సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కుతోంది. సినిమాకు ప్రాంతం, బాషతో సంబంధం లేదు. ప్రతీ రంగాన్ని ఆస్వాదిస్తున్నాను కాబట్టే సినిమా, టీవీ, రాజకీయ రంగాల్లో రాణిస్తున్నాను. తెలుగులో తారక్ నటన అంటే చాలా ఇష్టం. అవకాశముంటే చిరు, బాలయ్య, తారక్ తో సినిమా చేయడాని సిద్ధంగా ఉన్నాను. – కుష్బూనెల రోజుల్లో కొత్త సినిమా ఈసారి అబుదాబి ఐఫా ఉత్సవం 2024ను నేను, తేజా సజ్జ కలిసి చేయబోతున్నాం. సినిమాను తెలుగు అభిమానులు సెలబ్రేట్ చేసుకున్నంత మరెవరూ చేసుకోరేమో. మరో నెల రోజుల్లో కొత్త సినిమా గురించి వివరాలు చెబుతాను. – రానా దగ్గుపాటి రాశీ ఖన్నా– చివరి సారి జరిగిన ఐఫా ఉత్సవంలో పాల్గొన్నాను. ఇన్నేళ్ల తరువాత మళ్లీ జరుగుతుండటం సంతోషంగా ఉంది. దేవీ శ్రీ ప్రసాద్ – పుష్ప 2 కోసం అందరిలానే నేనూ ఎదురు చూస్తున్నారు. సుకుమార్ మరింత క్రేజీగా రెండో భాగాన్ని రూపొందించారు. రషి్మక ఇరగదీసింది. సినిమా ప్రయాణంలో హైదరాబాద్ ప్రత్యేకమైనది. శ్రీలీల– ఐఫా వేదికపై డ్యాన్స్ స్టెప్పులు వేయనున్నాను. కుర్చీ మడతపెట్టి ప్రజలకు బాగా చేరువైంది. ఇలాంటి వేదికల పై సినిమా కుటుంబాన్ని ఒకేసారి కలుసుకోవడం ఆనందంగా ఉంటుంది. తేజ సజ్జ– హనుమాన్ సక్సెస్ సంతోషాన్నిచి్చంది. మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. త్వరలో అప్డేట్ చేస్తాను. ఐఫా లో రానా తో పాటు హోస్ట్ గా చేస్తున్నాను. ఫరియా అబ్దుల్లా– కలి్కలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. షూటింగు సమయంలో ప్రభాస్ చేసిన అల్లరి మరచిపోలేను. మరో 3 సినిమాల్లో నటిస్తున్నాను. సిమ్రాన్– చాలా రోజుల తరువాత తెలుగు అభిమానులను కలుసుకోవడం ఆనందంగా ఉంది. బాలయ్యతో నరసింహ రెడ్డి పాటలకు వేసిన స్టెప్పులు గుర్తొస్తున్నాయి. ప్రస్తుతం హిందీ, తమిళ్లో సినిమాలు చేస్తున్నాను. అవకాశాలను బట్టి తెలుగులోనూ చేయాలని ఉంది. అక్షర హాసన్– తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తున్నాను. హైదారాబాద్ ఎప్పుడు వచి్చనా మంచి అనుభూతి. తెలుగులోనూ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రగ్యా జైశ్వాల్– 2017లో ఐఫా ఉత్సవంలో కంచె సినిమా నేపథ్యంలో పాల్గొన్నాను. తెలుగు సినిమా ఎదిగిన తీరు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. తెలుగులో మరో 2 సినిమాలు చేస్తున్నాను. నవదీప్– మొదటి ఐఫా అవార్డ్స్ కు హోస్ట్ గా చేశాను. నా నటన కన్నా నా మాటలను అభిమానులు బాగా ఆదరించారు. ఈ మధ్య కాలంలో ఓటీటీ లో మంచి సక్సెస్ ను అందుకున్నాను. -
పరిస్థితుల్ని బట్టి పరిశ్రమ ఎక్కడికైనా వెళ్లొచ్చు!
‘‘సినీ పరిశ్రమ హైదరాబాద్‌లోనే స్థిరంగా, శాశ్వతంగా ఉంటుందని భావించడానికి వీల్లేదు. పరిస్థితుల్ని బట్టి ఎక్కడికైనా తరలివెళ్లొచ్చు’’ అని నిర్మాత డి.సురేశ్‌బాబు సంచలన వాఖ్యలు చేశారు. వెంకటేశ్ హీరోగా శ్రీప్రియ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘దృశ్యం’ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం సురేశ్ విలేకరులతో ముచ్చటించారు. రాష్ట్రం రెండుగా విడిపోయిన నేపథ్యంలో సినీపరిశ్రమ స్థితిగతుల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు సురేశ్. వాటిపైనే చిత్రసీమ పయనం ఆధారపడి ఉంది: ప్రతిభావంతులైన యువతరం సినీ పరిశ్రమలోకి వస్తున్న నేపథ్యంలో రానున్న ఐదేళ్లలో సినీ పరిశ్రమలో విప్లవాత్మకమైన మార్పులు రానున్నాయి. తెలుగు సినిమా ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి కానుంది. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, వైజాగ్, తడ ప్రాంతాలు సినిమా పరిశ్రమకు నివాసం కానున్నాయి. అయితే... రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు తెలుగు సినిమాకు ప్రకటించే రాయితీలు, సౌకర్యాల కల్పన, చిత్రీకరణ సౌలభ్యాలపైనే... చిత్రసీమ పయనం ఆధారపడి ఉంటుందిఆ మూడు ప్రాంతాల నుంచే ప్రధాన కార్యకలాపాలు: ప్రస్తుతం సినిమాలకు ల్యాబ్‌లతో పని లేదు. డిజిటల్ యుగం వచ్చేసింది. ల్యాప్‌ట్యాప్‌లోనే ఎడిటింగ్ చేసేసుకోవచ్చు. కాస్తంత సదుపాయాలు ఏర్పరచుకుంటే... ఇంట్లోనే డబ్బింగ్, రీ-రికార్డింగ్, రికార్డింగ్ చేసుకోవచ్చు. అంతగా అభివృద్ధి చెందింది టెక్నాలజీ. ఈ కారణంగా ఎక్కడ నుంచైనా సినిమాలను నిర్మించవచ్చు. అయితే... సినీ పరిశ్రమ ఎంతగా విస్తరించినా... ప్రధానంగా మద్రాస్, వైజాగ్, హైదరాబాద్‌ల నుంచే కార్యకలాపాల నిర్వహణ జరుగుతుంది. అక్కడ ఈ ఇబ్బందులు లేవు: సినీ నిర్మాణ పరంగా హైదరాబాద్‌లో అంతర్జాతీయ సౌకర్యాలున్నాయి కానీ... ఐడియాలే లేవు. తెలుగు సినిమా పరిధిలోనే ఆలోచనలు ఉంటున్నాయి. దాన్ని విస్తృతపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ అవుడ్డోర్ సీన్స్ తీయడం తలకు మించిన పని. పోలీసులకు డబ్బులు కట్టుకోవాలి. పైగా జనాల తాకిడి. అమలాపురం, పాలకొల్లు, వైజాగ్ లాంటి ప్రాంతాల్లో అయితే ఈ బాధలే లేవు. చక్కగా షూటింగ్ చేసుకోవచ్చు. గోదావరి జిల్లాల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ‘ఉయ్యాలా జంపాల’ సినిమా తీసేశాం. అలా విమర్శించడం తగదు: మంచి సినిమాలు తీస్తే డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఎగ్జిబిటర్లు కానీ తీసుకోవడానికి ముందుకొస్తారు. అంతేకానీ ఏది పడితే అది తీసి, మాకు థియేటర్లు దొరకడం లేదంటే ఎలా? ముందు పంపిణీదారుల నుంచి, థియేటర్ యాజమాన్యం నుంచీ సినిమాపై డిమాండ్‌ను సృష్టించుకోవాలి. ఆ దిశగా ఆలోచించకుండా ‘పరిశ్రమ ఆ నలుగురి చేతుల్లోనే ఉంద’ని విమర్శించడం తగదు. ఇక్కడ మాత్రమే కాదు... దేశవ్యాప్తంగా థియేటర్లు కొందరి చేతుల్లోనే ఉన్నాయి. బాలీవుడ్లో సైతం కొన్ని అగ్ర నిర్మాణ సంస్థలే థియేటర్లను నడిపిస్తున్నాయి. చట్టానికి కట్టుబడి ఎలాంటి వ్యాపారం చేసినా తప్పు కాదు. అది ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలి. ఓ రంగంలో ఉన్నత స్థాయికి ఎదగడం తేలికైన విషయం కాదు. ఒక్క సురేశ్ ప్రొడక్షన్స్‌కే సినీరంగంలో 50ఏళ్ల చరిత్ర ఉంది. ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి బిజినెస్ చేస్తే తప్పు ఎలా అవుతుంది? ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి.