వెనిస్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ షురూ | Venice Film Festival 2020 Lineup Announced | Sakshi
Sakshi News home page

వెనిస్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ షురూ

Published Fri, Jul 31 2020 5:47 AM | Last Updated on Fri, Jul 31 2020 5:47 AM

Venice Film Festival 2020 Lineup Announced - Sakshi

కోవిడ్‌ కారణంగా ఈ ఏడాది జరగాల్సిన ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ అన్నీ వాయిదా పడ్డాయి. మే నెలలో  జరగాల్సిన కాన్స్‌ చిత్రోత్సవాలు జరగలేదు. వచ్చే ఏడాది జరిగే  గోల్డెన్‌ గ్లోబ్స్, ఆస్కార్‌ అవార్డులను కొన్ని వారాలు  వెనక్కి జరిపారు. ఈ ఏడాది జరగాల్సిన కొన్ని ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ ను వర్చువల్‌ గా (ఆన్‌ లైన్‌ లో) జరపడానికి నిశ్చయిం చారు.

అయితే వెనిస్‌ చిత్రోత్స వాలను కోవిడ్‌ గైడ్‌ లైన్స్‌ పాటిస్తూ జరపబోతున్నట్టు ప్రకటించారు నిర్వాహకులు. సెప్టెంబర్‌ 2 నుంచి 12 వరకు జరిగే ఈ ఫెస్టివల్లో సుమారు 50 దేశాలు పాల్గొన బోతున్నాయి. ఈ సంబరానికి హాజరుకానున్న వాళ్లందరికీ ఉష్ణోగ్రత చూసే లోపలికి అనుమతి స్తారట. ప్రతీ రెండో సీట్‌ ఖాళీగా ఉండేలా చూసుకుంటారట. ఈ ఫెస్టివల్‌కి హాజరు కావాలను కున్నవాళ్లు ముందుగానే రిజిస్టర్‌ చేసుకోవాలని కూడా తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement