ప్రఖ్యాత ఫిల్మ్ ఫెస్టివల్ కాన్స్ వాయిదా పడింది. ఈ ఏడాది కాన్స్ చిత్రోత్సవాలు కరోనా కారణంగా జరుగుతాయా? లేదా? అనుకుంటున్న సందర్భంలో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించబోవడం లేదని కాన్స్ నిర్వాహకులు ప్రకటించారు. ప్రతి ఏడాది ఫ్రాన్స్‌లో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది. కాన్స్‌లో గెలుపొందిన సినిమాల నుంచే ఆస్కార్ రేసు కూడా మొదలవుతోంది. ఈ ఏడాది మే 12 నుంచి 23 వరకు ఈ ఫెస్టివల్‌ను నిర్వహించాలని ముందు అనుకున్నారు. కానీ కరోనా ప్రభావంతో జరగడంలేదని ఓ లేఖను విడుదల చేశారు. ‘‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కాన్స్‌ని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం. జూన్ చివర్లోనో లేదా జూలై ప్రారంభంలోనో కాన్స్ ఫెస్టివల్‌ని నిర్వహించాలనుకుంటున్నాం’’ అని చిత్రోత్సవాల నిర్వాహకులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment