
ప్రముఖ హాస్యనటుడు బ్రహానందానికి మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సౌత్ ఏసియా సెంటర్ వారు బ్రహ్మీని సత్కరించనున్నారు. అక్టోబర్ 6న జరగనున్న ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు.
1964లో జకార్తాలో జరిగిన ఫిలిం ఫెస్టివల్ లో మహానటుడు ఎస్వీ రంగారావుకు ఇదే తరహా సత్కారం దక్కింది. తరువాత ఇన్నేళ్లకు అదే సత్కారం బ్రహ్మానందం అందుకోనుండటం విశేషం. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమాతో పాటు మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న ఆచారి అమెరికా యాత్ర సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు బ్రహ్మానందం.
Comments
Please login to add a commentAdd a comment