ఆత్మహత్యగా నిర్ధారించిన పోలీసులు
బెంగళూర్‌లో అంత్యక్రియలు
గచ్చిబౌలి: కన్నడ నటి శోభిత మృతదేహానికి సోమవారం ఉస్మానియా హాస్పిటల్‌లో పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని శ్రీరాంనగర్‌లో భర్త సు«దీర్ రెడ్డితో కలిసి నివాసం ఉంటున్న శోభిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె కుటుంబసభ్యులు గచ్చిబౌలి పీఎస్‌కు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి పోస్టు మార్టం పూర్తయిన తర్వాత శోభిత మృతదేహాన్ని బెంగళూర్‌కు తీసుకెళ్లారు. శోభిత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోస్టుమార్టంలో నిర్ధారణ అయినట్లు ఉస్మానియా వైద్యులు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
ఆత్మహత్య చేసుకున్న రోజు రాత్రి 10 గంటల సమయంలో శోభిత తన సోదరితో ఫోన్‌లో మాట్లాడిందని, తాము సంతోషంగా ఉన్నామని, కొద్ది రోజుల్లోనే ఇద్దరం కలిసి ఊరికి వస్తామని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కాగా ‘ఎవ్రీ థింగ్ ఫర్‌ఫెక్ట్, చావాలనుకుంటే డూఇట్’ అని శోభిత రూమ్‌లో నోట్ రాసి ఉందని ఇన్‌స్పెక్టర్ హభీబుల్లాఖాన్ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడి కాలేదని, శోభిత బంధువులు అనుమానాలు వ్యక్త చేయలేదని ఆయన పేర్కొన్నారు. భర్త అనుమానంతో డోర్ పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా శోభిత ఉరి వేసుకుని కనిపించిందని, ఆ సమయంలోనూ గదిలో భక్తి పాటలు ప్లే అవుతున్నట్లు తెలిసింది.
ఇటీవలే గోవాకు వెళ్లారు
కొద్ది రోజుల క్రితమే గోవాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్‌కు శోభిత, సుదీర్ వెళ్లినట్లు తెలిసింది. తిరిగి వచ్చిన తర్వాత కూడా భార్యాభర్తలు బాగానే ఉన్నారని ఇరుగు పొరుగు వారితో పాటు వారి కుటుంబ సభ్యులు పేర్కొనడం గమనార్హం.
నటనకు అభ్యంతరం చెప్పలేదు: బుచ్చిరెడ్డి
మ్యాట్రిమోని ద్వారా ఇరు కుటుంబాల అంగీకారంతోనే వివాహం చేశామని శోభిత మామ(భర్త తండ్రి) బుచ్చిరెడ్డి పేర్కొన్నారు. సినిమాలు, సీరియల్స్‌లో నటించేందుకు తాము ఎప్పడు అభ్యంతరం చెప్పలేదన్నారు. ఆమె ఎప్పుడు భగవంతుని ధ్యానంలో ఉండేదని, తమ ఇంట్లో కూతురి లాగా మెలిగిందని ఆయన పేర్కొన్నారు. కుటుంబ సభ్యురాలిని కోల్పోయామని, సుధీర్ రెడ్డి డిప్రెషన్‌లో ఉన్నాడన్నారు. శోభిత కుటుంబసభ్యుల కోరిక మేరకు బెంగళూర్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment