సాక్షి,సిటీబ్యూరో: 19వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నవంబర్ 14 నుంచి 20 వరకు హైదరాబాద్ నగరం ఈ ఫెస్టివల్‌కు వేదికకానున్నది. ది చిల్డ్రన్స్ ఫిల్మ్ సోసైటీ అందుకు సంబంధించిన కసరత్తును ప్రారంభించింది. 13 మల్టీప్లెక్సుల్లో 200 సినిమాలు ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో బాలల చిత్రాలు ప్రదర్శించనున్నారు. చిల్డ్రన్స్ జ్యూరీలో పిల్లలు కూడా జడ్జిలుగా వ్యవహరిస్తారు.
ఐమ్యాక్స్ లో మీడియా పాయింట్‌ను ఏర్పాటు చేయనున్నారు. చివరిరోజు కేఎం రాధాక్రిష్ణన్‌తో డిజైన్ చేయించిన స్పెషల్ థీమ్ సాంగ్స్ ఫెస్టివల్‌కి ప్రధాన ఆకర్షణ కానున్నాయి. దేశ నలుమూలల నుంచి 500 మంది ప్రతినిధులు ఇందులో పాల్గోనున్నారు. బాలల చలనచిత్రోత్సవాలకు ప్రసాద్ ఐ మ్యాక్స్ ప్రధాన క్రేందం కానున్నది. ఫెస్టివల్ పర్యవేక్షణ కోసం 25 మంది ప్రముఖులతో ఓ కమిటీ కూడా వేశారు. భారతీయ సినిమా వందేళ్ల పేరుతో ఒక ఎగ్జిబిషన్‌ను నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.
ఐమ్యాక్స్ కేంద్రంగా చిల్డ్రన్స్ ఫిలిమ్ ఫెస్టివల్
Published Mon, Oct 26 2015 9:48 PM | Last Updated on Sun, Sep 3 2017 11:31 AM
Advertisement
Advertisement