
సంగీత దర్శకుడు, నటుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. ఈయన నటించిన తాజా చిత్రాల్లో సర్వం తాళ్ మయం ఒకటి. ఇంతకు ముందు మిన్సార కనవు, కండుకొండేన్ కండుకొండేన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్ సుమారు 18 ఏళ్ల తరువాత దర్శకత్వం వహించిన చిత్రం సర్వం తాళ మయం.
ఇందులో జీవీకి జంటగా అపర్ణా బాలమురళి నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం జపాన్, టోక్యో నగరంలో జరుగుతున్న 31వ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ విషయాన్ని జీవీ.ప్రకాశ్‌కుమార్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment