మంజుమ్మెల్ బాయ్స్‌ మరో ఘనత.. ఏకైక భారతీయ చిత్రంగా! | Manjummel Boys to compete at Russia KinoBravo Film Festival | Sakshi
Sakshi News home page

Manjummel Boys: మంజుమ్మెల్ బాయ్స్‌ మరో ఘనత.. ఏకంగా ఆ పోటీలో!

Published Mon, Sep 30 2024 5:27 PM | Last Updated on Mon, Sep 30 2024 5:41 PM

Manjummel Boys to compete at Russia KinoBravo Film Festival

మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. భాషతో సంబంధం లేకుండా అదరగొట్టింది. తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన ఘనత దక్కింది.  రష్యాలో ప్రారంభమైన కినోబ్రావో ఫిల్మ్ ఫెస్టివల్‌లో పోటీకి మంజుమ్మెల్ బాయ్స్‌ ఎంపికైంది. ఈ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్‌లో పోటీలో నిలిచిన ఏకైక భారతీయ చిత్రంగా ఘనత సాధించింది.

కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో మలయాళంలో థియేటర్లలో రిలీజైన ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత అన్ని భాషల్లోనూ విడుదల చేయగా.. సూపర్‌ హిట్‌గా నిలిచింది. యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అత్యధిక వసూళ్లు చేసిన మలయాళ చిత్రాలలో ఒకటిగా ఘనత దక్కించుకుంది.

(ఇది చదవండి: ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ మూవీ రివ్యూ)

తాజాగా ఈ సినిమాను అక్టోబర్ 1న రష్యాలోని సోచిలో  ప్రదర్శించనున్నారు. మంజుమ్మెల్ బాయ్స్‌తో పాటు ఎస్ఎస్ రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్, పాయల్ కపాడియా మూవీ ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రాలను వివిధ కేటగిరీలలో ప్రదర్శించనున్నారు. ప్రముఖ రచయిత, దర్శకుడు విశాల్ భరద్వాజ్ ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కు జ్యూరీ మెంబర్‌గా వ్యవహరించడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ అక్టోబర్ 4, 2024 వరకు కొనసాగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement