
కారులోంచి చొచ్చుకెళ్లిన రెయిలింగ్ మేఘన(ఫైల్)
మేడ్చల్: కళాశాలకు సెలవులు ఇవ్వడంతో తండ్రితో కలిసి ఇంటికి వెళుతున్న ఓ బాలిక కారు అదుపుతప్పడంతో తండ్రి కళ్లెదుటే మృతి చెందిన సంఘటన గురువారం మేడ్చల్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నాయుడు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అదిలాబాద్ జిల్లా, నిర్మల్‌కు చెందిన మురళీగౌడ్ కుమార్తె మేఘన(17) బాచుపల్లి శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. గురువారం నుంచి కాలేజీకి సెలవులు ప్రకటించడంతో మురళీ గౌడ్ గురువారం మధ్యాహ్నం కుమార్తెను తీసుకుని కారులో నిర్మల్ వెళుతుండగా అత్వెల్లి శివారులోని రేకుల బావి మలుపు వద్ద కారు అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న రేలింగ్ ను ఢీ కొట్టింది.కారు వేగంగా ఉండటంతో రేలింగ్ రేకులు వెనుక సీట్లో కూర్చున మేఘన తలలోకి చొచ్చుకెళ్లడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మురళీగౌడ్, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మేఘన మృతదేహన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment