
చాంద్రాయణగుట్ట: శుభకార్యం హడావుడిలో ఉన్న ఓ వ్యక్తి ఇంట్లో నుంచి కారు తీసే క్రమంలో ముందు ఆడుకుంటున్న కుమార్తె పైనుంచి పోవడంతో మృతి చెందింది. ఎస్సై వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం.. సలాల ప్రాంతానికి చెందిన ఓ ఇంట్లో ఈ నెల 23న నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఈ హడావుడిలో ఉన్న అతడు తన ఇన్నోవా కారును ఉదయం 4 గంటల సమయంలో బయటికి తీస్తున్నాడు. ఈ సమయంలో కారు ముందు భాగంలో ఆడుకుంటున్న తన 18 నెలల కుమార్తెను గమనించకుండా ముందుకు పోనిచ్చాడు. బాలిక తలపై నుంచి కారు ముందు టైర్ వెళ్లడంతో తీవ్ర గాయమయ్యింది. ఇది గమనించిన అతడు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సుమోటాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment