
గడ్డం మేఘన
టంగుటూరు: ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘనను న్యూజిలాండ్‌లో ‘సేవా కార్యక్రమాలు, యువత’ విభాగానికి ప్రాతినిథ్యం వహించే పార్లమెంట్ సభ్యురాలిగా అక్కడి ప్రభుత్వం నామినేట్ చేసింది. మేఘన తండ్రి రవికుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం రీత్యా 2001లో న్యూజిలాండ్‌లో స్థిరపడ్డారు. చిన్నతనం నుంచే మేఘన సేవా కార్యక్రమాల్లో పాల్గొనేది. ఫిబ్రవరిలో ప్రమాణ స్వీకారం చేస్తుందని ఆమె తండ్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment