tanguturu
-
Watch Live: టంగుటూరులో సీఎం జగన్ ప్రచార సభ
-
జగనన్నతోనే అభివృద్ధి సాధ్యం
-
న్యూజిలాండ్‌లో ఎంపీగా ప్రకాశం జిల్లా యువతి
టంగుటూరు: ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘనను న్యూజిలాండ్‌లో ‘సేవా కార్యక్రమాలు, యువత’ విభాగానికి ప్రాతినిథ్యం వహించే పార్లమెంట్ సభ్యురాలిగా అక్కడి ప్రభుత్వం నామినేట్ చేసింది. మేఘన తండ్రి రవికుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం రీత్యా 2001లో న్యూజిలాండ్‌లో స్థిరపడ్డారు. చిన్నతనం నుంచే మేఘన సేవా కార్యక్రమాల్లో పాల్గొనేది. ఫిబ్రవరిలో ప్రమాణ స్వీకారం చేస్తుందని ఆమె తండ్రి తెలిపారు. -
పొదిలి–టంగుటూరు రోడ్డుకు మహర్దశ
కొండపి: జిల్లాలోని పశ్చిమ ప్రాంతం నుంచి తూర్పున ఉన్న చెన్త్నె నేషనల్ హైవేని అనుసంధానిస్తూ పొదిలి– టంగుటూరు ఆర్అండ్బీ రహదారికి ప్రభుత్వం సుమారు రూ.40 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీంతో టంగుటూరు–పొదిలి ఆర్అండ్బీ రోడ్డుకు మహర్దశ పట్టనుంది. ఈమేరకు మరో నెల రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకుని రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన దొనకొండను ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్‌గా ప్రకటించింది. దొనకొండ నుంచి నెల్లూరు జిల్లాలోని క్రిష్ణపట్నం పోర్టుకు వెళ్లేందుకు పొదిలి వయా కొండపి మీదుగా టంగుటూరు వద్ద కలిసే చెన్త్నె హైవేకు దొనకొండ నుంచి దూరం తగ్గనుండటంతో ప్రభుత్వం ఈ రహదారిని అభివృద్ధి చేసేందుకు నిర్ణయించింది. దొనకొండ నుంచి ఈ రహదారి గుండా క్రిష్ణపట్నం పోర్టుకు వెళ్లేందుకు దగ్గర రహదారి కావటంతో ప్రభుత్వం సింగిల్ రోడ్డుగా ఉన్న మర్రిపూడి మండలంలోని 49 కిలో మీటరు కూచిపూడి నుంచి 66 కిలో మీటరు పొదిలి వరకు 17 కిలోమీటర్ల మేర రోడ్డును 3.66 మీటర్ల నుంచి 7 మీటర్లకు విస్తరణ చేయనుంది. అదే విధంగా పెట్లూరులో 3 కిలోమీటర్ల మేర 5.50 మీటర్ల రోడ్డును 7 మీటర్లుగా, టంగుటూరు వద్ద ఒక కిలో మీటరు రోడ్డును విస్తరించనుంది. దీంతో పాటు మర్రిపూడి, గంగపాలెం, జాళ్లవాగువద్ద సుమారు రూ.2 కోట్లతో హైలెవల్ బ్రిడ్జిలను సైతం నిర్మించనుంది. దీంతో పొదిలి నుంచి టంగుటూరు వరకు 66 కిలో మీటర్ల ఆర్అండ్బీ రోడ్డు విస్తరణ పనులు పూర్తయి రవాణాకు అనుకూలంగా మారుతుంది. ఈ రహదారి నిర్మాణంతో జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన మార్కాపురం, కొండపి నియోజకవర్గాల్లోని వందలాది గ్రామాల ప్రజలకు ఈ రహదారి నిర్మాణం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. రహదారి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయటంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు టంగుటూరు – పొదిలి మధ్య మొత్తం 66 కిలో మీటర్ల దూరం ఉండగా గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కొండపి నుంచి మర్రిపూడి మండలం వరకు రహదారి విస్తరణ పనులు జరిగాయి. తాజాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దొనకొండ, రామాయపట్నం పోర్టును దృష్టిలో పెట్టుకుని ఈ రహదారికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది. దీంతో పొదిలి నుంచి నేషనల్ హైవేకి 10 కిలోమీటర్ల దూరం తగ్గటమే కాకుండా టోల్గేట్ సైతం లేకుండా రవాణాకు ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ప్రజలు ఆనందిస్తున్నారు. ఏదేమైనా దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రోడ్డు విస్తరణ పనులకు నిధులు మంజూరు కావటంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయమై కొండపి ఇన్చార్జి ఏఈని వివరణ కోరగా రూ.40 కోట్లు ఎన్డీబీ నిధులు మంజూరయ్యాయని, టెండర్ దశలో ఉందని టెండర్ ప్రక్రియ అనంతరం పనులు మొదలు పెడతామన్నారు. -
మహిళా దొంగ అరెస్టు
సాక్షి, ఒంగోలు క్రైం: బస్సుల్లో ప్రయాణిస్తున్న వారి బ్యాగులను మాయం చేసే మహిళా దొంగను ఒంగోలు సీసీఎస్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ మేరకు సీసీఎస్ పోలీసులు సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మహిళా దొంగకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. పేర్నమిట్టకు చెందిన వనర్చి శారద ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల బ్యాగులు మాయం చేయడంలో నేర్పరి. ఆమె వద్ద నుంచి నాలుగున్నర సవర్ల బంగారు ఆభరణాలు, వెండి కాళ్ల పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుంది. టంగుటూరు ఎస్ఐ హజరత్తయ్య ఆధ్వర్యంలో సీసీఎస్ పోలీసులు టంగుటూరు బస్టాండ్ సెంటర్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వనర్చి శారదను అదుపులోకి తీసుకొని విచారించడంతో ఆమె చేసిన దొంగతనాలు బయటపడ్డాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేసినట్లు కూడా ఆమె అంగీకరించింది. మహిళా దొంగను పట్టుకున్న సీసీఎస్ ఎస్ఐ నారాయణ, ఏఎస్ఐ వెంకటేశ్వరరెడ్డి, బాలాజీనాయుడు, చంద్రశేఖర్, కోటయ్య, శేషు, రామకృష్ణలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారని సీసీఎస్ డీఎస్పీ కేశన వెంకటేశ్వరరావు తెలిపారు. -
టంగుటూరు హైవేపై రోడ్డు ప్రమాదం
-
తెలుగు తమ్ముళ్ల డిష్యుం..డిష్యుం!
► నాయకుల ఎదుటే ఇరువర్గాల బాహాబాహీ టంగుటూరు (కొండపి) : టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టంగుటూరు తెలుగుదేశం పార్టీకి చెందిన ఇరువర్గాల నేతలు ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి సాక్షిగా బుధవారం తన్నుకున్నారు. తన ఎదుటే పార్టీకి చెందిన ఇరువర్గాలు కొట్టుకోవడంతో ఎమ్మెల్యే హతాశుడయ్యారు. ఇదీ.. జరిగింది: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక బొమ్మల సెంటర్ కూడలిలో ఆ పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు స్థానిక శాసన సభ్యుడు డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే కోరారు. స్థానిక రాజీవ్ నగర్‌కు చెందిన టీడీపీ నేత రాచపూడి రాము లేచి రాజీవ్ నగర్ సమస్య అలాగే పెండింగ్‌లో ఉందని, సమస్యను పరిష్కరించకుండా ఏళ్లతరబడి మాటలతో సరిపెడుతున్నారంటూ ఎమ్మెల్యేను ఉద్దేశించి అసహనంగా అన్నాడు. అక్కడే ఉన్న సర్పంచి వర్గీయులు తీవ్ర ఆగ్రహంతో రాముపైకి దూకారు. కె.శ్రీను, వెంకట్రావ్ అనే కార్యకర్తలు దాడి చేయడంతో రాము కిందపడ్డాడు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఉన్నా ఎవరూ వారిని వారించకపోవడం గమనార్హం. బిత్తరపోయిన ఎమ్మెల్యే స్వామి ఎందుకొచ్చిన తంటా..అని అక్కడి నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి ఇరువర్గాలనూ నిలువరించారు. ఈ విషయమై ఇరువర్గాలు పోలీసుస్టేషన్లో కేసులు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావును వివరణ కోరగా ఇరువర్గాలు ఫిర్యాదులు చేయలేదని చెప్పారు. -
టంగుటూరు వాసికి శిల్పగురు అవార్డు
బనగానపల్లె: మండలంలోని టంగుటూరు గ్రామానికి చెందిన కాచిరెడ్డి శివప్రసాదరెడ్డి గీసిన కలంకారి చిత్రానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన శిల్పగురు అవార్డు లభించింది. 2015 జాతీయ పురస్కారాలు, హస్త కళాకారులకు ఎంపిక సందర్భంగా దేశంలోనే 8 మంది చిత్రకారులు గీసిన కలంకారి చిత్రాలను ఎంపిక చేశారు. ఇందులో తాను గీసిన విలేజ్ వీవర్స్ కలంకారి చిత్రం కూడా ఉన్నట్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 9 వతేది ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన సభలో రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రశంస పత్రం, మెమోంటోతో పాటు రూ.2లక్షల నగదు అందుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టెక్స్టైల్ మినిస్టర్ స్కృతి ఇరాని, డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండీ క్రాఫ్ట్ ఇతర ముఖ్య అతి«థులు పాల్గొన్నట్లు తెలిపారు. -
మేమున్నామనీ.. మీకేం కాదనీ!
సేవ.. ఆధ్యాత్మికం.. ఆరోగ్యమే లక్ష్యంగా మణికంఠ సత్సంగ్ సొసైటీ ముందుకు సాగుతోంది. మనిషిలో దాగి ఉన్న మానవత్వ విలువలను పంచుకునే వేదికగా సొసైటీని తీర్చిదిద్దడంలో వ్యవస్థాపకులు సఫలమయ్యారు. సేవా భావంతో ముందుకొచ్చే కొత్త సభ్యులను కలుపుకుంటూ తమ సేవలను విస్తృత పరుస్తున్నారు. అనాథలు, అభాగ్యులకు అండగా మేమున్నామంటూ భరోసా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. - సేవా, ఆధ్యాత్మిక స్ఫూర్తి ప్రదాత మణికంఠ సత్సంగ్ సొసైటీ - మానవత్వ విలువలు పంచుకునే వేదికగా తీర్చిదిద్దుతున్న వ్యవస్థాపకులు - అనాథలు, అభాగ్యులను అక్కున చేర్చుకోవడమే ధ్యేయంగా సేవలు విస్తృతం - అనంతవరం రోడ్డులో రూ.కోటితో ముగిసిన మొదటి దశ భవన నిర్మాణ పనులు - దసరా రోజు వృద్ధాశ్రమం ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి : అబ్బూరి వరప్రసాద్ టంగుటూరు : మండల కేంద్రం టంగుటూరుకు చెందిన అబ్బూరి వరప్రసాద్ సామాన్య అయ్యప్ప భక్తుడు. అతడి సంకల్పమే నేటి మణికంఠ సత్సంగ్ సొసైటీ. ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మిక స్ఫూర్తి కలిగించి, వారిలో మానవత్వాన్ని మేల్కొలిపి తద్వారా సమాజ సేవ చేయించాలన్నది వరప్రసాద్ ఆలోచన. ప్రసాద్ తన ఆలోచనను మిత్రుడు, ఎస్బీహెచ్లో ఉన్నత ఉద్యోగి పెరవలి నాగరవికాంత్తో పంచుకున్నారు. ఆయన ఆలోచనలోని మానవీయ విలువలకు అండగా ఉంటానని రవికాంత్ ముందుకొచ్చారు. సమాజ సేవలో తాము సైతం..అంటూ మరికొంతమంది చేయి కలిపారు. వ్యస్థాపకుల్లో అత్యధికులు అయ్యప్ప భక్తులు కావడంతో 2009లో కార్తీకపౌర్ణమి రోజు మణికంఠ సత్సంగ్ సొసైటీని స్థాపించారు. అప్పటి నుంచి ఆధ్యాత్మిక, ఆరోగ్య, విద్యా సేవలో సొసైటీ తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తోంది. నేడు ఎలాంటి ఆదరణ లేని వృద్ధులకు ఆశ్రయం ఇచ్చే స్థాయికి ఎదిగింది. ఏడాదిలో రెండు సార్లు మెగా రక్తదాన శిబిరాలు సొసైటీ ఆరో ఏట అడుగిడిన నాటి నుంచి ఏడాదికి రెండు సార్లు మెగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తోంది. ఇప్పటి వరకూ సుమారు 500 మంది యువకుల నుంచి 750 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఆ రక్తం ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టగలిగింది. సొసైటీ వ్యవస్థాపకులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకూ సాయపడ్డారు. విద్యార్థులకు ఉచితంగా ప్లేట్లు,గ్లాసులు పంపిణీ చేశారు. విద్యా సేవలను మరింత విస్తృత పరిచేందుకు సంసిద్ధులవుతున్నారు. అన్నదానంలో మేటి : ఏటా కార్తీక పౌర్ణమిలో అయ్యప్ప జన్మనక్షత్రమైన ఉత్తరానక్షత్రం రోజు అన్నదానం చేస్తారు. టంగుటూరు అయ్యప్ప గుడిలో కార్తీకపౌర్ణమి నుంచి సంక్రాంతికి వారం ముందు వరకు దాతల సహకారంతో అయ్యప్ప భక్తులకు అన్నదానం చేస్తూనే ఉంటారు. ఈ కార్యక్రమానికి సొసైటీ తన సంపూర్ణ సహకారం అందిస్తోంది. రూ.4 కోట్లతో 60 గదుల నిర్మాణమే లక్ష్యం మణికంఠ సొసైటీ తన సేవలను మరింత విస్తృత పరుస్తోంది. ఇప్పటికే వృద్ధాశ్రమాన్ని నిర్మించింది. ఇందుకు వ్యవస్థాపకులు టంగుటూరుకు సమీపంలో అనంతవరం రోడ్డులో 1.10 ఎకరాల భూమి సేకరించారు. నిర్మాణ పనులను 2013 ఫిబ్రవరిలో చిన్న వెంకయ్యస్వామి చేతుల మీదుగా ప్రారంభించారు. 100 మంది వృద్ధులకు ఉచితంగా ఆశ్రయం కల్పించేందుకు వీలుగా, అలాగే 20 మంది అనాథ పిల్లలకు ఆశ్రయంతో పాటు చదువు చెప్పేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 5 ఫోర్లలో 60 గదులు నిర్మిస్తున్నారు. ఇందుకు సుమారు రూ.4 కోట్లు ఖర్చు అవుతుందని భావిస్తున్నారు. ముందుగా రూ.కోటి వెచ్చించి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. వచ్చే నెల 22వ తేదీ దసరా రోజు ఆశ్రమం ప్రారంభిస్తున్నట్లు వరప్రసాద్ చెప్పారు. -
పాలేటిలోపడవ బోల్తా
టంగుటూరు, న్యూస్‌లైన్ : పాలేటిలో పడవ బోల్తా పడటంతో అందులో ఉన్న ఎనిమిది మంది బాలురు నీట మునగగా వారిలో ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని అనంతవరం పంచాయతీ తాళ్లపాలెంలో ఆదివారం జరగగా సోమవారం వెలుగుచూసింది. టంగుటూరుకు చెందిన ఏడుగురు బాలురు సముద్రం చూసేందుకు తాళ్లపాలెం వెళ్లారు. సముద్రం వద్దకు తోడు రమ్మని వీరంతా తాళ్లపాలేనికి చెందిన బాలుడు నాయుడు గణేశ్(11)ను కోరారు. ఇందుకు అంగీకరించిన గణేశ్.. వారిని పాలేటి మీదుగా నీటిలో నడుచుకుంటూ సముద్రం వద్దకు తీసుకెళ్లాడు. సముద్రం చూసిన అనంతరం తిరిగి వచ్చే సరికి పాలేరు పోటుతో నిండుగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడే ఉన్న ఒక పడవలో వీరంతా ఎక్కారు. మార్గమధ్యంలో నీటి ప్రవాహానికి పడవ అటూ ఇటూ ఒరిగింది. భయంతో బాలురంతా చెల్లాచెదురుగా నీటిలో దూకారు. అందరిలో అరకొర ఈత వచ్చింది గణేశ్‌కే. నీట దూకిన వారంతా భయంతో గణేశ్‌ను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ కంగారులో అందరికంటే పొట్టిగా ఉన్న గణేశ్ నీట మునిగాడు. వీరి కేకలకు సమీపంలో రొయ్యల చెరువుల వద్ద ఉన్న వారు సంఘటన స్థలానికి పరుగున వచ్చారు. వెంటనే పిల్లలను రక్షించి ఒడ్డుకు చేర్చారు. అప్పటికే నీట మునిగిన గణేశ్ ఊపిరాడక కన్ను మూశాడు. వీరిని రక్షించడం కాస్త ఆలస్యమై ఉంటే పడవలో ఉన్న ఏడుగురూ ప్రాణాలతో మిగిలేవారు కాదని స్థానికులు చెప్పారు. కుమారుని మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటనతో తాళ్లపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలుని మృతదేహానికి సోమవారం అంత్యక్రియలు జరిగాయి.