నిందితురాలితో సీసీఎస్ పోలీసులు
సాక్షి, ఒంగోలు క్రైం: బస్సుల్లో ప్రయాణిస్తున్న వారి బ్యాగులను మాయం చేసే మహిళా దొంగను ఒంగోలు సీసీఎస్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ మేరకు సీసీఎస్ పోలీసులు సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మహిళా దొంగకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. పేర్నమిట్టకు చెందిన వనర్చి శారద ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల బ్యాగులు మాయం చేయడంలో నేర్పరి. ఆమె వద్ద నుంచి నాలుగున్నర సవర్ల బంగారు ఆభరణాలు, వెండి కాళ్ల పట్టీలు స్వాధీనం చేసుకున్నారు.
వాటి విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుంది. టంగుటూరు ఎస్‌ఐ హజరత్తయ్య ఆధ్వర్యంలో సీసీఎస్ పోలీసులు టంగుటూరు బస్టాండ్ సెంటర్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వనర్చి శారదను అదుపులోకి తీసుకొని విచారించడంతో ఆమె చేసిన దొంగతనాలు బయటపడ్డాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేసినట్లు కూడా ఆమె అంగీకరించింది. మహిళా దొంగను పట్టుకున్న సీసీఎస్ ఎస్‌ఐ నారాయణ, ఏఎస్‌ఐ వెంకటేశ్వరరెడ్డి, బాలాజీనాయుడు, చంద్రశేఖర్, కోటయ్య, శేషు, రామకృష్ణలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారని సీసీఎస్ డీఎస్పీ కేశన వెంకటేశ్వరరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment