
మేఘన, పవన్ తేజ్
పవన్ తేజ్ కొణిదెల హీరోగా, మేఘన, లక్కీ హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. అభిరామ్ ఎం. దర్శకత్వం వహిస్తున్నారు. మాధవి సమర్పణలో ఎంవీటీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాజేష్ నాయుడు నిర్మిస్తున్నారు. రాజేష్ నాయుడు మాట్లాడుతూ– ‘‘థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. టైటిల్ ప్రకటించినప్పటి నుంచి మా సినిమాకి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. మంచి విజన్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే థ్రిల్లింగ్ అంశాలతో అభిరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
పవన్ తేజ్ కొణిదెలకి ఒక పర్ఫెక్ట్ లాంచింగ్ అవుతుంది. ‘జెస్సీ’, ‘ఓ పిట్టకథ’ సినిమాలకి పనిచేసిన సునీల్ కుమార్ విజువల్స్, ‘ఆర్‌ఎక్స్ 100’, ‘కల్కి’ చిత్రాల ఫేమ్ తాజుద్దీన్ సయ్యద్ మాటలు ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయి. త్వరలోనే టీజర్, పాటల విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. సినిమా విడుదల తేదీని కూడా త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ పామర్తి, లైన్ ప్రొడ్యూసర్: దుర్గా అనీల్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment