
పృథ్వీరాజన్
పవన్ తేజ్ కొణిదెల హీరోగా, మేఘన, లక్కీ హీరోయిన్లుగా అభిరామ్ ఎం. దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. మాధవి సమర్పణలో ఎంవీటీ ఎంటర్‌టైన్ మెంట్స్ పతాకంపై రాజేష్ నాయుడు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ‘పెళ్లి’ సినిమా ఫేమ్ పృథ్వీరాజన్ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ఆయన లుక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజేష్ నాయుడు మాట్లాడుతూ– ‘‘థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది.
ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెండో షెడ్యూల్ జరుపుతున్నాం. పవన్ తేజ్‌కి తొలి సినిమా అయినా అనుభవం ఉన్నవాడిలా నటిస్తున్నాడు. అభిరామ్ మేకింగ్ ఫ్రెష్‌గా ఉంది. ‘జెస్సీ’ ఫేమ్ సునీల్ కుమార్ విజువల్స్, ‘ఆర్‌ఎక్స్ 100, కల్కి’ చిత్రాలకు డైలాగ్స్ రాసిన తాజుద్దీన్ సయ్యద్ మాటలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ కొడకండ్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ పామర్తి, లైన్ ప్రొడ్యూసర్: దుర్గా అనిల్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment