
మేఘన, శ్రుతి ‘ట్రిపుల్’
సాక్షి, హైదరాబాద్: జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మేఘనా రెడ్డి (గోపీచంద్ అకాడమీ), డీవీ శ్రుతి మూడేసి టైటిళ్లు కైవసం చేసుకున్నారు. బాలికల సింగిల్స్ విభాగంలో మేఘన అండర్–15, 17, 19 టైటిళ్లు సాధించగా.. శ్రుతి అండర్–13 సింగిల్స్, డబుల్స్‌తోపాటు అండర్–15 డబుల్స్ టైటిళ్లు సొంతం చేసుకుంది. బుధవారం ముగిసిన ఈ టోర్నీలో మేఘన అండర్–15 విభాగంలో 21–14, 10–21, 21–16తో అభిలాష (వీబీఏ)పై, అండర్–19 ఫైనల్స్‌లో పూర్వీ సింగ్ (ఎల్బీ స్టేడియం)పై విజయం సాధించింది. అండర్–17 ఫైనల్ మ్యాచ్‌లో 21–14, 8–2తో మేఘన ఆధిక్యంలో ఉండగా... అభిలాష మ్యాచ్ నుంచి వైదొలిగింది. దీంతో మేఘన విజేతగా నిలిచింది.
అండర్–13 సింగిల్స్ విభాగంలో శ్రుతి 15–21, 21–18, 24–22తో శ్రేష్ఠ రెడ్డి (ఎల్బీ స్టేడియం)పై గెలుపొందింది. శ్రుతి–డీవీ లయ జోడీ అండర్–13 డబుల్స్ ఫైనల్ మ్యాచ్‌లో 21–13, 21–11తో తేజస్వి–శ్రేష్ఠ రెడ్డి జోడీపై, అండర్–15లో 21–19, 21–11తో వైష్ణవి– మృతిక జంటపై గెలిచి విజేతలుగా నిలిచింది. బాలికల అండర్–17 డబుల్స్ ఫైనల్స్‌లో కే. మేఘన–అను సోఫియా ద్వయం 25–23, 21–17తో వైష్ణవి–మృతికపై, అండర్–19 ఫైనల్స్‌లో పూర్వీ సింగ్–చక్రయుక్తారెడ్డి జోడీ 21–8, 21–11తో మౌన్య శ్రీ–నిపుణ జోడీపై విజయం సాధించారు. మహిళల సింగిల్స్‌లో పూజ (ఎల్బీ స్టేడియం) 21–13, 11–21, 21–19తో ప్రణాలి కర్ణి (ఎల్బీ స్టేడియం)పై, మహిళల డబుల్స్ ఫైనల్లో పూజ–ప్రణాలి కర్ణి (ఎల్బీ స్టేడియం) జోడి 21–7, 21–7తో వైష్ణవి–వర్ణిత జోడీపై గెలిచి టైటిల్స్ సాధించారు.
బాలుర ఫలితాలు: అండర్–13 సింగిల్స్: లోకేశ్ రెడ్డి (వీబీఏ) 21–7, 21–6తో జయ ఆదిత్యపై; డబుల్స్: మేఘాంశ్ ఆనంద్–శ్రావణ్ కుమార్ (వీబీఏ) జోడీ 21–16, 21–14తో రామ్–జయ ఆదిత్య (వీబీఏ) జంటపై గెలిచింది.
అండర్–15 సింగిల్స్: లోకేశ్ రెడ్డి 18–21, 21–13, 21–8తో తారక్ శ్రీనివాస్‌పై; డబుల్స్: తారక్ శ్రీనివాస్–వర్షిత్ రెడ్డి జోడీ 15–21, 21–18, 21–20తో శశాంక్ సాయి–శ్రీనివాసరావు జోడీపై నెగ్గింది. అండర్–17 తరుణ్ రెడ్డి 21–19, 21–20తో మనీశ్ కుమార్ (గోపీచంద్ అకాడమీ)పై; డబుల్స్: అనికేత్ రెడ్డి–తరుణ్ రెడ్డి జోడీ 21–19, 18–21, 21–7తో సాయి పృథ్వీ–రోహిత్ రెడ్డి (వీబీఏ)జోడీపై విజయం సాధించింది. అండర్–19 ఆదిత్య గుప్తా (ఎల్బీ స్టేడియం) 21–11, 21–12తో అనికేత్ రెడ్డి (వీబీఏ)పై; డబుల్స్: సాయి రోహిత్–ఆకాశ్ చంద్రన్ (గోపీచంద్ అకాడమీ) జోడీ 21–11, 21–14తో భవధీర్–ప్రేమ్ చౌహాన్ జంటపై గెలిచింది. పురుషులు సింగిల్స్: ఎన్‌వీఎస్ వీజేత (ఎల్బీ స్టేడియం) 21–18, 21–18తో సాయం బోత్రా (ఎల్బీ స్టేడియం)పై; డబుల్స్: సాయి రోహిత్– ఆకాశ్ చందన్ర్ ద్వయం 21–10, 21–13తో నిఖిల్ రెడ్డి– సాయం బోత్రా జంటపై నెగ్గింది.
పురుషులు 45+ సింగిల్స్: కమలాకర్ 21–6, 21–6తో వెంకటేశ్‌పై; డబుల్స్: రవి కిరణ్– వెంకటేశ్ జోడీ 21–6, 21–9తో శ్రీరామ్–ఆంజనేయులు జంటపై విజయం సాధించింది.