హైదరాబాద్: ఆసియా పసిఫిక్ యూత్ గేమ్స్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి మారెడ్డి మేఘనా రెడ్డి సత్తా చాటింది. రష్యాలోని వ్లాదివోస్తోక్ నగరంలో జరిగిన ఈ టోరీ్నలో అండర్–17 బాలికల డబుల్స్ విభాగంలో మేఘన తన భాగస్వామి తో కలిసి విజేతగా నిలిచింది.
ప్రస్తుతం మేఘ న భారతీయ విద్యాభవన్స్ స్కూల్‌లో 11వ తరగతి చదువుతోంది. ఈ టోర్నీలో భారత్‌తో పాటు రష్యా, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, థాయ్‌లాండ్, ఇండోనేసియా, మలేసియా, సింగపూర్, చైనీస్ తైపీ దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈనెల 3 నుంచి 9 వరకు ఈ టోర్నీ జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment