మేఘన (ఫైల్)
బనశంకరి: తరగతి ఎన్నికల్లో ఓటమి పాలై తోటి విద్యార్థు చేతిలో ర్యాగింగ్‌కు గురై ఆత్మహత్యకు పాల్పడిన కుమారస్వామి లేఔట్‌లోని దయానందసాగ కళాశాల విద్యార్థిని మేఘన కేసులో ఇద్దరు విద్యార్థినులతోసహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేఘనా క్లాస్ విభాగం చీఫ్ రాజకుమార్, సహవిద్యార్థులైన సౌధామిని, సందీప్, నిఖిల్, సంధ్యపై ఆత్మహత్య ప్రేరిపిత చట్టం కింద రాజరాజేశ్వరినగర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కు హాజరుకావాలని నోటీస్ జారీచేశారు. అయితే నిందితులు పరారీలో ఉండటంతో కుటుంబసభ్యులకు పోలీసులు నోటీసులు జారీచేసినట్లు డీసీపీ ఎంఎన్.అనుచేత్ తెలిపారు. ర్యాగింగ్‌వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబసభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
నలుగురు యువతులు, ఎనిమిది యువకులబృందం కాలేజీ ఆవరణలో మేఘనా తో గొడవపడ్డారని, ఈ దృశ్యాన్ని ప్రత్యర్థి వర్గ విద్యార్థి బృందం మోబైల్‌లో వీడీయో తీశారన్నారు. దీనిని ప్రశ్నించినందుకు సదరు విద్యార్థులు మేఘనపై దాడి చేసినట్లు వీడియో ఫుటేజ్‌ల్లో ఉందన్నారు. అదేవిధంగా ప్రత్యర్థి విద్యార్థులు గుమికూడి ర్యాగింగ్ ఎలా చేయాలనే విషయంపై చర్చించిన వీడియోలు తమకు లభ్యమైనట్లు ఆయన తెలిపారు. ఈ రెండు వీడియోలను ల్యాబ్‌కు పంపామని, నివేదిక వచ్చిన తర్వాత తదుపరిచర్యలు తీసుకుంటామని తెలిపారు. ర్యాగింగ్ జరగలేదని కాలేజీపాలకమండలి చెబుతుండగా మరో వైపు ఈ వీడియోలు వెలుగు చూశాయన్నారు. కాలేజీ పాలకమండలి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు విచారణలో వెలుగుచూస్తే వారిపై ప్రత్యేక కేసు నమోదు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment