Five arrest
-
ఐదుగురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను నగర సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో బాంబు పేలుళ్ల ద్వారా విధ్వంసానికి పాల్పడేందుకు ఈ ఐదుగురు ముష్కరులు సుహైల్, ఉమర్, తర్బేజ్, ముదాసీర్, ఫైజల్ కుట్ర పన్నినట్లు పోలీసులు చెప్పారు. వారిని ఎన్ఐఏ కోర్టులో హాజరుపర్చగా, ఐదు రోజుల పాటు సీసీబీ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దేశద్రోహ కార్యకలాపాలకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న సీసీబీ పోలీసులు హెబ్బాళ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ఇంటిపై దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై హెబ్బాళ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితుల వద్ద నుంచి ఏడు దేశవాలీ పిస్తోళ్లు, 45 బుల్లెట్లు, వాకీటాకీ సెట్స్, 12 మొబైల్ ఫోన్లు, రెండు శాటిలైట్ ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. బెంగళూరులో రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లకు ప్రణాళికలు రూపొందించినట్లు విచారణలో నిందితులు అంగీకరించాని పోలీసులు వెల్లడించారు. -
గెయిల్ డైరెక్టర్ రంగనాథన్ అరెస్ట్
న్యూఢిల్లీ: లంచాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై గెయిల్ మార్కెటింగ్ వ్యవహారాల డైరెక్టర్ ఈఎస్ రంగనాథన్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్ట్‌గేషన్ (సీబీఐ) అరెస్ట్ చేసింది. నోయిడాలో ఆయనకు ఉన్న నివాసంలో సోదాలు నిర్వహించి రూ.1.3 కోట్లతో పాటు విలువైన ఆభరణాలు, పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు కూడా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదే కేసులో మరో ఐదుగురిని కూడా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం నవంబర్ 2021లో గెయిల్ డైరెక్టర్‌ను ఇరువులు మధ్యవర్తులు ఎలా కలిశారు, లంచం ఎలా ఇచ్చారన్న విషయాన్ని సీబీఐ ఎఫ్ఐఆర్ వివరించింది. పెట్రో కెమికల్ ఉత్పత్తులను రాయితీపై అందజేస్తే లంచాలు అందించేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీల యజమానులతో కూడా నిందితులు సమావేశం అయ్యారని ఎఫ్ఐఆర్ తెలిపింది. సీబీఐ జరిపిన దాడుల్లో రంగనాథన్ సహాయకుడు ఎన్ రామకృష్ణన్ నాయర్ నివాసం కూడా ఒకటి. ఈ నివాసం నుంచి రూ.75 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎఫ్ఐఆర్లో రంగనాథన్, నాయర్లతోపాటు పవన్ గౌర్, రాజేష్ కుమార్, యునైటెడ్ పాలిమర్ ఇండస్ట్రీస్‌కు చెందిన సౌరభ్ గుప్తా, బన్సల్ ఏజెన్సీస్‌కి చెందిన ఆదిత్య బన్సాల్ ఉన్నారు. -
మేఘనా ఆత్మహత్యకేసులో ఐదుగురిపై కేసు
బనశంకరి: తరగతి ఎన్నికల్లో ఓటమి పాలై తోటి విద్యార్థు చేతిలో ర్యాగింగ్‌కు గురై ఆత్మహత్యకు పాల్పడిన కుమారస్వామి లేఔట్‌లోని దయానందసాగ కళాశాల విద్యార్థిని మేఘన కేసులో ఇద్దరు విద్యార్థినులతోసహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేఘనా క్లాస్ విభాగం చీఫ్ రాజకుమార్, సహవిద్యార్థులైన సౌధామిని, సందీప్, నిఖిల్, సంధ్యపై ఆత్మహత్య ప్రేరిపిత చట్టం కింద రాజరాజేశ్వరినగర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కు హాజరుకావాలని నోటీస్ జారీచేశారు. అయితే నిందితులు పరారీలో ఉండటంతో కుటుంబసభ్యులకు పోలీసులు నోటీసులు జారీచేసినట్లు డీసీపీ ఎంఎన్.అనుచేత్ తెలిపారు. ర్యాగింగ్వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబసభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నలుగురు యువతులు, ఎనిమిది యువకులబృందం కాలేజీ ఆవరణలో మేఘనా తో గొడవపడ్డారని, ఈ దృశ్యాన్ని ప్రత్యర్థి వర్గ విద్యార్థి బృందం మోబైల్లో వీడీయో తీశారన్నారు. దీనిని ప్రశ్నించినందుకు సదరు విద్యార్థులు మేఘనపై దాడి చేసినట్లు వీడియో ఫుటేజ్‌ల్లో ఉందన్నారు. అదేవిధంగా ప్రత్యర్థి విద్యార్థులు గుమికూడి ర్యాగింగ్ ఎలా చేయాలనే విషయంపై చర్చించిన వీడియోలు తమకు లభ్యమైనట్లు ఆయన తెలిపారు. ఈ రెండు వీడియోలను ల్యాబ్‌కు పంపామని, నివేదిక వచ్చిన తర్వాత తదుపరిచర్యలు తీసుకుంటామని తెలిపారు. ర్యాగింగ్ జరగలేదని కాలేజీపాలకమండలి చెబుతుండగా మరో వైపు ఈ వీడియోలు వెలుగు చూశాయన్నారు. కాలేజీ పాలకమండలి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు విచారణలో వెలుగుచూస్తే వారిపై ప్రత్యేక కేసు నమోదు చేస్తామన్నారు. -
పేకాట శిబిరంపై దాడులు.. ఐదుగురు అరెస్ట్
రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఐదుగురు పేకాట రాయుళ్లను పోలీసులు బుధవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. బుద్వేల్ రైల్వే స్టేషన్ సమీపంలోని లారీ పార్కింగ్ పక్కన కట్టెల గోదాములో పేకాట శిబిరం నడుస్తుందన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఐదుగుర్ని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.69,600 నగదు స్వాధీనం చేసుకున్నారు. -
50 కేజీల గంజాయి పట్టివేత, ఐదుగురి అరెస్ట్
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని అశ్వాపురంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న 50 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు. రూ. లక్ష రూపాయల నగదను స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.