సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను నగర సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో బాంబు పేలుళ్ల ద్వారా విధ్వంసానికి పాల్పడేందుకు ఈ ఐదుగురు ముష్కరులు సుహైల్, ఉమర్, తర్బేజ్, ముదాసీర్, ఫైజల్ కుట్ర పన్నినట్లు పోలీసులు చెప్పారు. వారిని ఎన్‌ఐఏ కోర్టులో హాజరుపర్చగా, ఐదు రోజుల పాటు సీసీబీ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
దేశద్రోహ కార్యకలాపాలకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న సీసీబీ పోలీసులు హెబ్బాళ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ఇంటిపై దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై హెబ్బాళ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితుల వద్ద నుంచి ఏడు దేశవాలీ పిస్తోళ్లు, 45 బుల్లెట్లు, వాకీటాకీ సెట్స్, 12 మొబైల్ ఫోన్లు, రెండు శాటిలైట్ ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. బెంగళూరులో రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లకు ప్రణాళికలు రూపొందించినట్లు విచారణలో నిందితులు అంగీకరించాని పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment