సాక్షి,బెంగళూరు: బెంగళూరులోని తిలక్‌నగర్‌లో తలదాచుకున్న ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు బృందం(ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తమిళనాడులో ఇటీవల అరెస్టయిన ఇద్దరు ఉగ్రవాదులు వెల్లడించిన సమాచారం మేరకు వీరిని అరెస్టు చేసినట్లు సమాచారం.
వివిధ రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో ఎన్‌ఐఏ బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గతంలో ఆకస్మిక దాడులు నిర్వహించి ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న 10 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఈనెల 15 నుంచి 17వ తేదీ మధ్య కర్ణాటకలో స్లీపింగ్ సెల్స్‌గా ఉన్న ఉగ్రవాదులు రాష్ట్రంలోని పలుచోట్ల దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని ఎన్‌ఐఏకు సమాచారం అందింది. ఈనేపథ్యంలో బెంగళూరులో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత సోదాలు నిర్వహించి ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ విషయాన్ని రాష్ట్ర హోం శాఖ ధ్రువీకరించాల్సి ఉంది.
ఎన్‌ఐఏ అదుపులో అనుమానితులు
Published Sun, Apr 3 2016 12:11 AM | Last Updated on Sun, Sep 3 2017 9:05 PM
Advertisement
Advertisement