
మేఘన, అనిల్ నెమలి
అనిల్ నెమలి, మేఘన జంటగా తారా నీలు కార్పొరేషన్ బ్యానర్‌పై అనురాగ్ స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఓ కొత్త చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్త సన్నివేశాన్ని శ్రీరామ్ క్లాప్ ఇచ్చారు. భూపతి రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. దాసరి కిరణ్ తొలి సన్నివేశాన్ని డైరెక్ట్ చేశారు. ఈ సందర్భంగా హీరో అనిల్ మాట్లాడుతూ ‘‘డైరెక్ట్ అవుదాం అని రామానాయుడు స్టూడియోలో కోర్స్ చేశాను. అనురాగ్ గారికి మా నాన్నతో ఉన్న పరిచయంతో, ఆయన చెప్పిన కథ నచ్చడంతో హీరో అయ్యాను’’ అన్నారు.
‘‘ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ అవకాశం ఇచ్చిన అనురాగ్ గారికి థాంక్స్’’ అన్నారు మేఘన. ‘‘ఈ సినిమాకు కథ, మాటలు, సంగీతం, నిర్మాణం, దర్శకత్వం నేనే చేస్తున్నాను. దేశ ఆర్ధిక వ్యవస్థ కుంటుపడింది. యువత సోషల్ మీడియాతో బిజీ అయిపోయింది. యువత ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందించనున్నాం. అనిల్, మేఘనను హీరో హీరోయినుగా పరిచయం చేస్తున్నాను. నలుగురు కుర్రాళ్లు బాంబ్ బ్లాస్ట్ నుంచి ప్రజల్ని ఎలా కాపాడార న్నదే సినిమా కథాంశం’’ అన్నారు అనురాగ్.
Comments
Please login to add a commentAdd a comment