సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్ రన్నరప్ కిడాంబి శ్రీకాంత్‌పై చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రశంసలు కురిపించాడు. గాయం నుంచి కోలుకుని వరుస మ్యాచ్‌లలో విజయం సాధించడం శుభపరిణామం అన్నాడు. అయితే, ఈ ఏడాది ఆరంభంలో శ్రీకాంత్‌లో ఆత్మవిశ్వాసం తక్కువగా కనిపించిందన్న గోపీచంద్.. టోర్నీలు ఆడుతున్నకొద్దీ ఆట మెరుగు కావడంతో తనపై తనకు నమ్మకం పెరిగిందని తెలిపాడు.
సరైన సమయంలో చెలరేగి విజయం సాధించాడని... అయితే వచ్చే ఏడాది మరిన్ని టోర్నీలు గెలవాలంటే శ్రీకాంత్ తాను చేస్తున్న తప్పులను సరిదిద్దుకోవాలని గోపీచంద్ సూచించాడు. ఏదేమైనా ఈ టోర్నీలో శ్రీకాంత్‌తో పాటు లక్ష్య సేన్, ప్రణయ్‌ల ప్రదర్శన పట్ల కూడా చాలా సంతృప్తిగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా వరల్డ్ చాంపియన్‌షిప్‌లో శ్రీకాంత్ రజత పతకం సాధించగా.. లక్ష్యసేన్ కాంస్యం గెలుచుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: IND Vs SA: అతడు ప్రపంచ స్ధాయి బౌలర్.. సౌతాఫ్రికాకు ఇక చుక్కలే!
Kidambi Srikanth 🇮🇳 and Loh Kean Yew 🇸🇬 are as cool as cucumbers in this spectacular rally.#TotalEnergiesBadminton #BWFWorldChampionships #Huelva2021 pic.twitter.com/0FS7OzBCb1
— BWF (@bwfmedia) December 20, 2021
Comments
Please login to add a commentAdd a comment