
ఫైనల్లో లోకేశ్, జయాదిత్య
హైదరాబాద్ జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో వీబీఏకు చెందిన లోకేశ్‌రెడ్డి, జయాదిత్య ఫైనల్‌కు చేరుకున్నారు.
సాక్షి, హైదరాబాద్: జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో వీబీఏకు చెందిన లోకేశ్‌రెడ్డి, జయాదిత్య ఫైనల్‌కు చేరుకున్నారు. కేవీబీఆర్ స్టేడియంలో సోమవారం జరిగిన అండర్–13 బాలుర సింగిల్స్ సెమీస్‌లో లోకేశ్ రెడ్డి (వీబీఏ) 21–15, 21–9తో టి. శ్రవణ్ కుమార్ (వీబీఏ)పై గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో జయాదిత్య 21–20, 21–18తో ఎస్. సాయిపై నెగ్గి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. బాలుర డబుల్స్ సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో బి. మేధాన్షు–శ్రవణ్ కుమార్ (వీబీఏ) ద్వయం 21–11, 18–21, 21–13తో ఏఎస్ చంద్రకౌశిక్–రోషన్ (హైదరాబాద్) జంటపై నెగ్గి ఫైనల్‌కు చేరుకుంది. మరో సెమీస్‌లో రామ్– ఆదిత్య జంట 21–8, 21–20తో ఓంప్రకాశ్–శర్వా (వీబీఏ) జోడీపై గెలుపొంది తుదిపోరుకు అర్హత సాధించింది.
మరోవైపు బాలికల విభాగంలో చందన, స్నేహదత్త ముందంజ వేశారు. అమీర్‌పేట్‌లోని జీహెచ్‌ఎంసీ ఇండోర్ స్టేడియంలో జరుగుతోన్న అండర్–13 బాలికల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో చందన (కేవీబీఆర్) 21–11తో మహిమ (జేపీఎస్)పై గెలుపొందగా... స్నేహ దత్త (కేఆర్‌సీ) 21–11తో ఎస్. ప్రహస్థను ఓడించింది.
ఇతరబాలికల సింగిల్స్ మ్యాచ్‌ల ఫలితాలు
ఎ. చరిష్మా 21–6తో సాయి పల్లవిపై, కె. రిత్విక 21–10తో సానియాపై, హారిక 21–16తో శ్రావణిపై, ఉన్నతి 21–7 తేజస్వినిపై, జరీనా 21–16 తో ఆపేక్షపై, ప్రజ్ఞ 21–9తో మోక్షపై, ధ్రుతి 21–8తో జెమీనాపై, సిమ్రన్ జీత్ కౌర్ 21–9తో నందితపై, యోచన 21–3తో రుచితపై, రోహిత రెడ్డి 21–11తో సిరి సహస్రపై, తేజస్విని 21–3తో లాక్షణ్యపై, సాయి చతుర 21–8తో సాయి సమీక్షపై, దేవ్ అనుష్య 21–16తో సక్సేనాపై, సాన్వి సింగ్ 21–4తో సాయి వర్ధినిపై, లయ 21–3తో దేవి అనన్యపై విజయం సాధించారు.
అండర్–15 బాలుర తొలి రౌండ్ ఫలితాలు బీఎన్‌వీఎస్ విఘ్నేశ్ 21–2తో కె. రోషన్ కుమార్‌పై, విఘ్నేశ్ కుమార్ 21–12తో సాహిత్ రెడ్డిపై, కేఎస్‌ఆర్ కార్తీ 21–6తో పి. సురాపై, శ్రీకర్ 21–10తో ఎం. హర్షపై, డి. అక్షయ్ 21–18తో బి. నిశాంత్‌పై, ఎం. సాయి వినయ్ 21–14తో ఎ. మనీశ్‌పై, ఫణి 21–14తో సాయి తనీశ్‌పై, అథర్వ్ 21–20తో అమిన్ సాంగ్విపై, ఆదిత్య 21–11తో రితేశ్ వర్మపై, మోనిశ్ రెడ్డి 21–15తో చౌదరీపై, కృతిక్ 21–5తో మనోజ్‌పై గెలుపొందారు.