న్యూఢిల్లీ: తెలుగమ్మాయి జక్కా వైష్ణవి రెడ్డి బెల్జియన్ జూనియర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో టైటిల్ చేజిక్కించుకుంది. మహిళల అండర్–19 సింగిల్స్ ఫైనల్లో ఆమె 21–19, 17–21, 21–12తో టాప్ సీడ్ వివియన్ సాండొర్‌హజి (హంగేరి)ని కంగుతినిపించింది. మరో వైపు ఇథియోపియా ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన అర్జున్–రామచంద్రన్ శ్లోక్ జంట విజేతగా నిలిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో ఈ జోడి 21–6, 21–19తో బహదిన్ అహ్మద్–మహ్మద్ నాసిర్ మన్సూర్ (జోర్డాన్) జంటపై గెలిచింది.