
సాక్షి, హైదరాబాద్: ఎంకే ఇంటర్ స్కూల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఆతిథ్య ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (నాచారం) విద్యార్థి శిఖా సత్తా చాటింది. అండర్–13, అండర్–15 సింగిల్స్ కేటగిరీల్లో, అండర్–13 డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచి మూడు స్వర్ణాలను హస్తగతం చేసుకుంది. సోమవారం జరిగిన అండర్–13 బాలికల సింగిల్స్ ఫైనల్లో శిఖా 15–6, 15–7తో శ్రీవల్లి (కేంద్రీయ విద్యాలయ)పై గెలుపొందింది. డబుల్స్‌లో శిఖా–యోగ్య ద్వయం 15–8, 15–9తో అనూష రస్తోగి–జాహ్నవి జోడీని ఓడించింది. అండర్–15 బాలికల సింగిల్స్ టైటిల్‌పోరులో శిఖా 15–9, 15–14తో అమూల్య (సరస్వతి విద్యాలయ)ను ఓడించింది. డబుల్స్‌లో అమూల్య–దీపిక (డీపీఎస్) జంట 15–7, 15–8తో ఆపేక్ష–దివ్య జోడీని ఓడించి విజేతగా నిలిచింది. బాలుర సింగిల్స్ ఫైనల్లో చెన్నాపతి 15–8, 15–10తో కుషాల్ అగర్వాల్‌పై నెగ్గింది.
డబుల్స్‌లో సెహ్వాగ్–చెన్నాపతి జంట 15–10, 15–12తో రిషి–శ్రీకర్ జోడిని ఓడించింది. అండర్–13 బాలుర సింగిల్స్‌లో రిషి 11–15, 15–9, 15–14తో వినయ్‌ని ఓడించగా... డబుల్స్‌లో యశ్‌వర్ధన్–సాయి సిద్ధార్థ్ జంట 15–10, 15–13తో వశిష్ట–శ్రీహాన్ జోడీపై గెలిచింది. అండర్–11 విభాగంలో మానవ్, లక్ష్మీ రిధిమ చాంపియన్‌లుగా నిలిచారు. ఫైనల్లో లక్ష్మీ రిధిమ 15–10, 15–13తో అనుసంజనపై, మానవ్ 30–8, 30–11తో సుహాస్‌పై గెలుపొందారు. డబుల్స్ కేటగిరీలో తనీషా–శ్రీరామ్ జంట 15–9, 15–8తో బ్రాహ్మిత్–సహిష్నాన్‌పై, అనుసంజన–యోగ్య ద్వయం 15–6, 15–8తో వైష్ణవి–శరణ్య (డీపీఎస్) జోడీపై గెలుపొంది టైటిళ్లను అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment