క్వార్టర్స్‌లో రీతుపర్ణ, రుత్విక | Ruthivika entered in quarter finals | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో రీతుపర్ణ, రుత్విక

Published Wed, Feb 4 2015 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM

క్వార్టర్స్‌లో రీతుపర్ణ, రుత్విక

క్వార్టర్స్‌లో రీతుపర్ణ, రుత్విక

జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్
 సాక్షి, విజయవాడ స్పోర్ట్స్: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయిలు రీతుపర్ణా దాస్, రుత్విక శివాని క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో మూడో సీడ్ రీతుపర్ణ 21-15, 21-11తో సాయి ఉత్తేజిత (ఏపీ)పై, ఆరో సీడ్ రుత్విక 21-5, 21-2తో రుత్ మిశా (కర్ణాటక)పై విజయం సాధించారు.
 
  వృశాలి (టీఎస్) 21-10, 21-13తో కుహూ గార్గ్ (ఉత్తరాఖండ్)పై నెగ్గగా, కె.వైష్ణవి (టీఎస్) 15-21, 17-21తో శైలి రాణె (ఎయిరిండియా) చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్‌లో పదో సీడ్ సిరిల్ వర్మ (టీఎస్) 21-16, 18-21, 21-16తో శ్యామ్‌ప్రసాద్ (కేరళ)పై, భమిడిపాటి సాయిప్రణీత్ (పీఎస్‌పీబీ) 21-13, 21-12తో ప్రతీక్ మహాజన్ (గోవా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. వికాస్ హర్ష (ఏపీ)కు 14-21, 9-21తో రోహిత్ యాదవ్ (ఏఏఐ) చేతిలో చుక్కెదురైంది.
 
 విజయవాడ క్లబ్‌లో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన క్యాంప్ ఫైర్ కార్యక్రమంలో డ్యాన్స్ చేస్తున్న జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్, పి.వి.సింధు, ఇతర క్రీడాకారిణులు. సీనియర్ నేషనల్స్ సందర్భంగా ఆటవిడుపు కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెలుగు, హిందీ, పంజాబ్ పాటలకు క్రీడాకారులు స్టెప్‌లు వేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement