Ruthivika
-
రుత్విక, సాయిప్రణీత్‌లకు టైటిల్స్
జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ విజయవాడ స్పోర్ట్స్: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్‌లో తెలుగు తేజాలు మెరిశారు. పురుషుల విభాగంలో పెట్రోలియంకు ఆడుతున్న సాయిప్రణీత్, మహిళల విభాగంలో ఖమ్మం అమ్మాయి రుత్వికా శివానీ టైటిల్స్ సాధించారు. గురువారం జరిగిన ఫైనల్స్‌లో సాయిప్రణీత్ 21-19, 15-21, 22-20తో సమీర్‌వర్మ(ఏఐ)పై గెలవగా... మహిళల ఫైనల్లో రుత్విక 21-13, 21-13తో తెలంగాణకే చెందిన రీతుపర్ణాదాస్పై నెగ్గింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో మనూఅత్రి(ఏఏఐ), సుమీత్ రెడ్డి(ఏపీ) జోడీ 17-21, 21-13, 21-17 తో ప్రణయ్ చోప్రా(పెట్రోలియం), అక్షయ్ దివాల్కర్(ఏఐ) జోడీపై నెగ్గగా... మహిళల డబుల్స్‌లో ప్రద్య్నాగాద్రే, సిక్కిరెడ్డి(ఏఏఐ)జోడీ 21-12, 16-21, 21-18తో అపర్ణాబాలన్, ప్రజక్తాసావంత్(పెట్రోలియం) జోడీపై గెలిచి టైటిల్స్ సాధించారు. మిక్స్డ్ డబుల్స్‌లో అరుణ్విష్ణు, అపర్ణాబాలన్(పెట్రోలియం) 21-16, 11-21, 21-15తో తరుణ్.కె(పెట్రోలియం), సిక్కిరెడ్డి(ఏఏఐ)ద్వయంపై నెగ్గి టైటిల్ గెలుచుకున్నారు. -
క్వార్టర్స్‌లో రీతుపర్ణ, రుత్విక
జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ సాక్షి, విజయవాడ స్పోర్ట్స్: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయిలు రీతుపర్ణా దాస్, రుత్విక శివాని క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో మూడో సీడ్ రీతుపర్ణ 21-15, 21-11తో సాయి ఉత్తేజిత (ఏపీ)పై, ఆరో సీడ్ రుత్విక 21-5, 21-2తో రుత్ మిశా (కర్ణాటక)పై విజయం సాధించారు. వృశాలి (టీఎస్) 21-10, 21-13తో కుహూ గార్గ్ (ఉత్తరాఖండ్)పై నెగ్గగా, కె.వైష్ణవి (టీఎస్) 15-21, 17-21తో శైలి రాణె (ఎయిరిండియా) చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్‌లో పదో సీడ్ సిరిల్ వర్మ (టీఎస్) 21-16, 18-21, 21-16తో శ్యామ్‌ప్రసాద్ (కేరళ)పై, భమిడిపాటి సాయిప్రణీత్ (పీఎస్‌పీబీ) 21-13, 21-12తో ప్రతీక్ మహాజన్ (గోవా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. వికాస్ హర్ష (ఏపీ)కు 14-21, 9-21తో రోహిత్ యాదవ్ (ఏఏఐ) చేతిలో చుక్కెదురైంది. విజయవాడ క్లబ్లో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన క్యాంప్ ఫైర్ కార్యక్రమంలో డ్యాన్స్ చేస్తున్న జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్, పి.వి.సింధు, ఇతర క్రీడాకారిణులు. సీనియర్ నేషనల్స్ సందర్భంగా ఆటవిడుపు కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెలుగు, హిందీ, పంజాబ్ పాటలకు క్రీడాకారులు స్టెప్లు వేశారు. -
రుత్విక, వృశాలి సంచలనం
క్వార్టర్స్‌లో రాహుల్, సిరిల్ వర్మ ఆలిండియా జూ॥బ్యాడ్మింటన్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: గౌతమ్ ఠక్కర్ స్మారక అఖిల భారత జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారిణులు జి.రుత్విక శివాని, జి.వృశాలి సంచలన విజయాలు సాధించారు. శుక్రవారం జరిగిన అండర్-19 బాలికల ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అన్‌సీడెడ్ రుత్విక 21-6, 21-16 తేడాతో మూడో సీడ్ శ్రీయాన్షి పర్దేశి (ఎయిరిండియా)పై... అన్‌సీడెడ్ వృశాలి 21-13, 17-21, 21-12తో ఆరో సీడ్ కరిష్మా వాడ్కర్ (మహారాష్ట్ర)పై గెలిచారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో క్రీడాకారిణి సంతోషి హాసిని 18-21, 15-21 తేడాతో రేష్మా కార్తీక్ (ఎయిరిండియా) చేతిలో ఓటమి పాలైంది. ఇక బాలికల అండర్-17 ప్రిక్వార్టర్స్‌లో సాయి ఉత్తేజితరావు 21-18, 20-22, 21-14 తేడాతో అశ్మితా చలీహ (అసోం)పై, జి.వృశాలి 21-16, 21-18 తేడాతో రియా ముఖర్జీ (ఉత్తరప్రదేశ్)పై గెలుపొందగా, కె.వైష్ణవి 21-15, 21-18 తేడాతో అనురా ప్రభుదేశాయ్ (గోవా)పై నెగ్గి క్వార్టర్స్‌కు చేరింది.అయితే బి.అర్చన 6-21, 6-21 తేడాతో శిఖా గౌతమ్ (కర్ణాటక) చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. బాలుర అండర్-17లో ఏపీ క్రీడాకారులు ఎం.కనిష్క్, రాహుల్ యాదవ్, సిరిల్ వర్మలు క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ కనిష్క్ 21-17, 21-12 తేడాతో కార్తీక్ జిందాల్ (హర్యానా)పై గెలుపొందగా, మూడో సీడ్ రాహుల్ యాదవ్ 21-11, 19-21, 21-18తో సిద్ధార్థ్ ప్రతాప్‌సింగ్ (చత్తీస్‌గఢ్)పై చెమటోడ్చి నెగ్గాడు. ఇక సిరిల్ వర్మ 21-12, 21-14తో నిశ్చయ్ జైస్వాల్ (మధ్యప్రదేశ్)పై గెలవగా, కె.జగదీశ్ 10-21, 17-21 తేడాతో రాహుల్ భరద్వాజ్ (కర్ణాటక) చేతిలో ఓటమిపాలయ్యాడు.